ఫ్యాక్ట్ చెక్: రహదారిపై నీరు బయటకు వస్తున్నట్లు చూపించే వైరల్ వీడియో కేరళకు సంబంధించింది.. గుజరాత్ కు కాదు
వర్షాకాలం ప్రారంభమైన తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో పలుచోట్ల రోడ్లు ధ్వంసమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఎన్నో ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వర్షాకాలం ప్రారంభమైన తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో పలుచోట్ల రోడ్లు ధ్వంసమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఎన్నో ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాల కారణంగా అయోధ్యలో కొత్తగా నిర్మించిన రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి. రోడ్డు నుండి ఫౌంటెన్ లాగా నీరు బయటకు వస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మోదీజీ దేశంలో అభివృద్ధికి చేస్తున్న పనులు ఇలాంటివే అనే క్యాప్షన్‌లతో వీడియోను వైరల్ చేస్తున్నారు.
అదే వీడియో మార్చి 2, 2024న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వైరల్ వీడియో గుజరాత్‌కు చెందినది కాదు, దేశంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, వరదలకు సంబంధించినది కాదు.
మేము వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. చిక్కు ఇర్షాద్ అనే వినియోగదారు Xలో ఒక పోస్ట్‌ను కనుగొన్నాము, అదే వీడియోను “కేరళలో నీటి సరఫరా ప్రాజెక్ట్ పైపు పగిలిపోయింది, కోజికోడ్-వయనాడ్ జాతీయ రహదారిపై కూన్నమంగళం వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది." అంటూ ఈ వీడియోను ఫిబ్రవరి 25, 2024న అప్లోడ్ చేశారు.
“KSEB officials promptly arrived and switched off the line. As the main road to Wayanad, the incident caused a substantial traffic jam in the area. Locals reported frequent pipeline bursts in the region.” #Kerala #India #Japan #Water అంటూ మరో పోస్టు కూడా వెంటనే పెట్టారు. వాయనాడ్ లోని మెయిన్ రోడ్ లో ఇది జరిగిందని తెలిపారు. స్థానికులు ఈ పైప్ లైన్ ను పగిలిపోతున్నాయంటూ పలుమార్లు చెప్పినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
దెబ్బతిన్న పైపుల నుండి వచ్చే నీటి కారణంగా పౌరులు, ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉంది. ఈ ధ్వంసమైన వాటికి బాధ్యులెవరో తెలియదు.. అంటూ మరో ట్వీట్ ను చూడొచ్చు.
ఆ యూజర్ బయోలో జర్నలిస్ట్ అని ఉంది.
ఇది కాలికట్, కున్నమంగళంలో నీటి సరఫరా పైపు లైన్ పగిలిపోవడం వల్ల జరిగిందని.. అఖిల్‌రాజ్ కె అనే యూట్యూబ్ ఛానెల్ లో తెలిపారు.
మరింత పరిశోధించగా.. కూన్నమంగళం 10వ మైలు వద్ద జాతీయ రహదారిపై జపాన్ తాగునీటి ప్రాజెక్టులో భాగమైన పైప్‌లైన్ పగిలిందని మలయాళ వార్తా వెబ్‌సైట్ జనమ్ ఆన్‌లైన్‌లో ప్రచురించిన కథనం మాకు కనిపించింది. పైపులు పగిలిపోవడంతో జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పైపు నుండి నీరు చాలా ఎత్తుకు ఎగసిపడింది. విద్యుత్ లైన్‌కు తగిలేంత వరకు నీరు పెరగడంతో కేఎస్‌ఈబీ అధికారులు దెబ్బతిన్న పైప్ ను మార్చారు. కూన్నమంగళం పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సమీపంలో డివైడర్లు వేశారు. విషయం తెలిసినా వాటర్ అథారిటీ అధికారులు ఆలస్యంగా అక్కడికి చేరుకోకపోవడంతో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియోలో ఎలాంటి నిజం లేదు. ఇది ఫిబ్రవరి 2024లో కేరళలో పగిలిన పైపుకు సంబంధించింది.
Claim : ఒక వైరల్ వీడియో గుజరాత్ మోడల్ అభివృద్ధి అంటే ఇదే అనే వాదనతో షేర్ చేస్తున్నారు
Claimed By : Social media users
Fact Check : False