ఫ్యాక్ట్ చెక్: రైలులో నీరు లీక్ అవుతున్నట్లుగా చూపించే వైరల్ వీడియో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించినది కాదు

భారీ వర్షాలు దేశ రాజధాని ఢిల్లీని తాకాయి. గుజరాత్, ఇతర రాష్ట్రాలలో లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. అనేక ప్రాంతాలలో భారీ వర్షం విధ్వంసం సృష్టించింది. విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. రోడ్లు కోతకు గురయ్యాయి.

Update: 2024-07-04 06:06 GMT

Garib rath train

భారీ వర్షాలు దేశ రాజధాని ఢిల్లీని తాకాయి. గుజరాత్, ఇతర రాష్ట్రాలలో లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. అనేక ప్రాంతాలలో భారీ వర్షం విధ్వంసం సృష్టించింది. విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. రోడ్లు కోతకు గురయ్యాయి. ఢిల్లీలో విమానాశ్రయంలోని టెర్మినల్ పైకప్పు కూలి ఒక వ్యక్తి మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షంతో వాటర్ ట్యాంక్ కూలి ఇద్దరు మహిళలు మృతి చెందారు.

ఈ పరిస్థితుల మధ్య.. రైలు క్యాబిన్ లోపల నీరు లీక్ అవుతున్నట్లు చూపించే వీడియో X (ట్విట్టర్) లో వైరల్ అవుతోంది. వందే భారత్ రైలు లీక్ అవుతోంది.. ప్రయాణికులకు ఉచిత షవర్ సౌకర్యం లభిస్తోందంటూ వ్యంగ్యంగా పోస్టులు పెట్టారు. ఇది లీకేజీ సర్కార్ అంటూ పరోక్షంగా NEET-UG, UGC-NET ప్రశ్నపత్రాల లీకేజీ గురించి విమర్శలు గుప్పించారు.
“Abki baar #Leakage Sarkar. After Temple, Bridge & Airports…. Here is the video from Vande Bharat Train. The roof of the WORLD CLASS #VandeBharat train is leaking. Passengers on the train get free SHOWER FACILITY. Thank you @AshwiniVaishnaw & @narendramodi” అంటూ పోస్టులు పెట్టారు. గుళ్లు, బ్రిడ్జిలు, ఎయిర్ పోర్టులే కాదు.. వందే భారత్ ట్రైన్ కూడా లీకేజీని ఎదుర్కొంటోందని ట్వీట్ లో విమర్శించారు.



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. లీకేజీ ఘటన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లో జరగలేదు. గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో లీకేజీ కనిపించింది.
జాగ్రత్తగా గమనించగా.. రైలు నంబర్ వీడియోలో కనిపించింది. రైలు నంబర్ 12215/12216 కాగా.. కోచ్ నంబర్ G-12. మేము ఈ రైలు నంబర్ కోసం Googleలో సెర్చ్ చేశాం. రైలు బాంద్రా టెర్మినస్ కు సంబంధించిన గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ అని కనుగొన్నాము.

మేము indiarailinfo.com వెబ్‌సైట్‌ లో వెతకగా.. 12215 నంబర్ ఉన్న రైలును ఢిల్లీ సరాయ్ రోహిల్లా - బాంద్రా టెర్మినస్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ అని మేము నిర్ధారించాము.


‘Rain Water Leaks in 3 AC Garib Rath train. Train no. 12215/12216’ అనే టైటిల్ తో జూన్ 29, 2024న Zee Business కు సంబంధించిన YouTube ఛానెల్ లో వీడియోను అప్లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము. “एक वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है, जिसमें एक ट्रेन में बारिश का पानी झरने की तरह गिरता दिखाई दे रहा है. लोग सोशल मीडिया पर इस घटना को लेकर शिकायत कर रहे हैं. यह घटना गरीब रथ ट्रेन नंबर 12215/12216 में घटी है. यह ट्रेन 3 एसी क्लास की है.” అనే వివరణ వీడియోకు ఇచ్చారు.

సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది, అందులో వర్షపు నీరు రైలుపై పడటం కనిపిస్తుంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ సంఘటన గరీబ్ రథ్ రైలు నంబర్ 12215లో చోటు చేసుకుంది. థర్డ్ AC బోగీలో ఈ ఘటన జరిగింది.

Full View

పశ్చిమ రైల్వే అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో వందే భారత్ రైలుకు సంబంధించి వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. వదంతులను ఖండించారు. అజ్మీర్ - ఫల్నా స్టేషన్ల మధ్య రైలు నంబర్ 12215, బాంద్రా టెర్మినస్ - ఢిల్లీ సరాయ్ రోహిల్లా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ కోచ్ G-12లో నీటి లీకేజీ ఉందని తేలింది. ఫల్నాకు ముందే రైలును నిలిపివేసి, నీటి లీకేజీ సమస్యను సరిచేసినట్లు రైల్వే అధికారులు వివరణ ఇచ్చారు.
వైరల్ వీడియో గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లోని నీటి లీకేజీకి సంబంధించింది. వందే భారత్ రైలుకు సంబంధించింది కాదు. గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ G-12 కోచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉంది.
Claim :  వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో నుండి నీరు లీక్ అవుతున్నట్లు వైరల్ వీడియో చూపిస్తుంది
Claimed By :  Twitter users
Fact Check :  Misleading
Tags:    

Similar News