ఫ్యాక్ట్ చెక్: మహిళ రోడ్డు మీద గుంతలో పడిపోతున్నట్లు చూపించే వీడియో భారతదేశానికి చెందినది కాదు
భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్, మిజోరాం తదితర రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు.
భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్, మిజోరాం తదితర రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువడంతో రోడ్లు మూసుకుపోయాయి. ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో వీధులన్నీ జలమయమయ్యాయి. వర్షం కారణంగా రోడ్లపై పెద్దపెద్ద రంధ్రాలు ఏర్పడిన కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన రహదారి రాంపథ్‌లో ఒక మహిళ గుంతలో పడిపోయిందంటూ ఓ వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఒక మహిళ వీధిలో నడుస్తూ వెళుతూ గుంతలో పడిపోవడం వీడియో చూపిస్తుంది. కొంతమంది వ్యక్తులు నీటితో నిండిన గుంత నుండి ఆమెను రక్షించడానికి పరుగెత్తారు.
‘अयोध्या का शानदार रामपथ। सिर्फ 13 किमी, एक गुजराती कंपनी ने बनाया है, मात्र 844 करोड़ में। प्रति किलोमीटर सिर्फ 66 करोड़! इससे बेहतर टैक्सपेयर्स के पैसे का और क्या सदुपयोग हो सकता था मित्रों? राह चलते स्नान का पुण्य! అంటూ హిందీలో పోస్టులు పెట్టారు. 'అయోధ్య లోని అద్భుతమైన రామ్ పథ్. కేవలం 844 కోట్లతో 13 కిలోమీటర్ల రోడ్డును గుజరాతీ కంపెనీ నిర్మించింది. ఒక్కో కిలోమీటరుకు 66 కోట్లు మాత్రమే! మిత్రులారా, పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఇంతకంటే మంచి ఉపయోగం ఏముంటుంది? నడుస్తూ స్నానం చేస్తే పుణ్యం!’ అని అందులో సెటైర్లు వేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ వీడియో.. భారతదేశానికి సంబంధించింది కాదు.
మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. వీడియో గత కొంతకాలం ఆన్‌లైన్‌లో ఉన్నట్లు మేము కనుగొన్నాము. మేము జూన్ 25, 2024న షేర్ చేసిన Instagram పోస్ట్‌ని కనుగొన్నాము.
ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసిన మరో పోస్ట్ ఇక్కడ ఉంది.
మరింత శోధించినప్పుడు, మేము alagoas24horas.com.br అనే వెబ్‌సైట్‌లో జూన్ 2022లో ప్రచురించిన కథనాన్ని చూశాం. బ్రెజిల్ దేశంలోని కాస్కావెల్, సియారాలోని వీధిలో నడుస్తున్నప్పుడు స్త్రీని సింక్ హోల్ మింగేసిందనే శీర్షికతో ఒక కథనాన్ని కనుగొన్నాము. ఆ కథనం ప్రకారం, ఫోర్టలేజాలోని మెట్రోపాలిటన్ ప్రాంతంలోని కాస్కావెల్‌లోని రోడ్డుపై నీటితో నిండిన రంధ్రం కారణంగా ఓ మహిళ గుంతలోకి పడిపోయింది. ప్రమాద దృశ్యాన్ని సెక్యూరిటీ కెమెరాలో చిత్రీకరించారు.
istoe.com.brలో ప్రచురించిన ఒక కథనం ప్రకారం, 48 ఏళ్ల మరియా రోసిలీన్ అల్మెయిడా డి సౌజా, ఫోర్టలేజా (CE)లోని కాస్కావెల్‌లో కాలిబాటపై నడుస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. యూట్యూబ్ ఛానల్ CATVE విడుదల చేసిన వీడియోలో, మరియా చేతిలో గొడుగు పట్టుకుని కాలిబాట వెంబడి నడుస్తున్నది చూడవచ్చు. ఆ సమయంలో ఆమె ఒక్కసారిగా రోడ్డు మీద రంధ్రంలో పడిపోయింది. ముగ్గురు వ్యక్తులు వెంటనే ఆమెకు సహాయం చేశారు.
ఒక మహిళ గుంతలో పడిపోతున్నట్లు చూపుతున్న వైరల్ వీడియో బ్రెజిల్‌లోని కాస్కావెల్ ప్రాంతానికి సంబంధించింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య తో ఎలాంటి సంబంధం లేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : అయోధ్య లోని రామ్ పథ్ లో కొత్తగా వేసిన రోడ్డు మీద గుంతలో మహిళ పడిపోవడం చూపిస్తుంది
Claimed By : Social media users
Fact Check : False