నిజ నిర్ధరణ: లేదు, వైరల్ వీడియో దుబాయ్ నగరంలో వరదలను చూపట్లేదు

"భారీ వర్షాల కారణంగా దుబాయ్‌ ని వరదలు ముంచెత్తాయి" అంటూ వీధుల్లో వరద నీరు ప్రవహిస్తూ, దుకాణాలు ఇళ్లన్నీ మునిగిపోతున్న ఒక వీడియో వైరల్ అవుతోంది.

Update: 2022-08-01 13:44 GMT

"భారీ వర్షాల కారణంగా దుబాయ్‌ ని వరదలు ముంచెత్తాయి" అంటూ వీధుల్లో వరద నీరు ప్రవహిస్తూ, దుకాణాలు ఇళ్లన్నీ మునిగిపోతున్న ఒక వీడియో వైరల్ అవుతోంది. దుబాయ్ దేశాన్ని వరదలు ముంచెత్తాయని పేర్కొంటూ తెలుగు లోకల్ టీవీ చానల్ లో కూడా ఒక ప్రోగ్రామ్‌లో ఈ వీడియో ని ప్రసారం చేసారు.

Full View

"దుబాయ్ వరదలు" అనే క్యాప్షన్‌తో కొద్దిమంది వినియోగదారులు అదే వీడియోను షేర్ చేశారు.

Full View

https://www.facebook.com/reel/1232874427506970

నిజ నిర్ధారణ:

వైరల్ వీడియో దుబాయ్ నగరంలో వచ్చిన వరదలను చూపిస్తోందన్న వాదన 'తప్పుదారి పట్టించేది'.

ముందుగా, దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఒక నగరం, యూఏఈ లోని వివిధ ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి, అయితే దుబాయ్ వాటిలో ఒకటి కాదు. అక్కడ వరదలు రాలేదు.

వీడియో నుండి సంగ్రహించబడిన కీఫ్రేమ్‌లను (ఇన్విడ్ టూల్ ఉపయోగించి) గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో శోధించినప్పుడు, ఆ వీడియో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఫుజిరా నగరంలో వరద పరిస్థితిని చూపుతుందని తెలుస్తోంది.

ఎండిటీవి నివేదిక ప్రకారం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని చాలా ప్రాంతాలు భారీ వర్షంతో దెబ్బతిన్నాయి, అనేక ప్రాంతాలు వరదలకు గురయ్యాయి. రక్షకులు షార్జా మరియు ఫుజైరా నుండి ప్రజలను రక్షించినట్లు చూపించే అనేక వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. రెండు నగరాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి - ముఖ్యంగా పర్వత భూభాగం, లోయల కారణంగా ఫుజైరా నగరం ముంపుకు గురయ్యింది. దుబాయ్, అబుదాబిలో నివసించే ప్రజలు వర్షపాతం తక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.

లైవ్మింట్.కాం నివేదిక ప్రకారం, 27 సంవత్సరాలలో మొదటిసారి యూఏఈ లో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. ఫుజైరా అత్యంత ప్రభావితమైన నగరాలలో ఒకటి. ఫుజైరాలో నీట మునిగిన కార్లు, దుకాణాలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఆకస్మిక వరదల తర్వాత 870 మందిని అత్యవసర బృందాలు రక్షించాయని నేషనల్ న్యూస్ నివేదించాయి. మొత్తం 3,897 మందిని షార్జా, ఫుజైరాలో తాత్కాలిక షెల్టర్లలో ఉంచారు. కుండపోత వర్షాల తర్వాత యుఏఈ మిలిటరీ ఫుజైరాలో సహాయక చర్యలు ప్రాప్రంభించింది.

ఈ కథనం వైరల్ వీడియోను కూడా షేర్ చేసింది.

https://www.livemint.com/news/world/uae-floods-roads-swamped-in-2-ft-of-water-cars-shops-float-watch-11659100224620.html

షార్జా, ఫుజిరా మొదలైన నగరాల్లో ఎంతో నష్టం సంభవించింది, అయితే, అబుదాబి, దుబాయ్ వంటి నగరాల్లో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. ఫుజైరాలో వరదల అనంతర పరిణామాలను ప్రదర్శిస్తూ, నగరం మొత్తం తీవ్రంగా దెబ్బతిన్నట్లు వేరొక వీడియో చూపిస్తుంది. చాలా వాహనాలు రోడ్ల పక్కన తలక్రిందులుగా పడి ఉన్నాయి.

https://www.news18.com/news/buzz/watch-cars-float-under-gushing-water-as-floods-wreak-havoc-in-uae-5653579.html

అందువల్ల, వైరల్ వీడియో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఫుజైరా నగరంలో వరద పరిస్థితిని చూపుతుంది, దుబాయ్ నగరంలో వరదలు లేవు. ఈ దావా తప్పుదారి పట్టించేది.
Claim :  viral video shows floods in the city of Dubai
Claimed By :  Social Media Users
Fact Check :  Misleading
Tags:    

Similar News