నిజ నిర్ధారణ: నార్వేజియన్ దౌత్యవేత్త షేర్ చేసిన వాటర్ హైవే వీడియో చైనాకు చెందినది, భారతదేశంది కాదు

నార్వే దౌత్యవేత్త, మాజీ రాజకీయ నాయకుడు ఎరిక్ సోల్హీమ్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా నీటిలో మునిగిన రహదారి పై ండుస్తున్న వాహనాల వీడియోను పంచుకున్నారు. ఇది భారతదేశంలోని మొదటి నీటి రహదారిని చూపుతుందనే వాదనతో అతను వీడియోను షేర్ చేసారు.

Update: 2022-09-19 06:41 GMT

నార్వే దౌత్యవేత్త, మాజీ రాజకీయ నాయకుడు ఎరిక్ సోల్హీమ్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా నీటిలో మునిగిన రహదారి పై నడుస్తున్న వాహనాల వీడియోను పంచుకున్నారు. ఇది భారతదేశంలోని మొదటి నీటి రహదారిని చూపుతుందనే వాదనతో అతను వీడియోను షేర్ చేసారు.

ట్వీట్ లో ఇలా ఉంది: "Incredible India! I finally encountered the most beautiful water highway" అనువదించగా "ఇన్‌క్రెడిబుల్ ఇండియా! నేను చివరకు అత్యంత అందమైన నీటి రహదారిని చూసాను"

https://mobile.twitter.com/ErikSolheim/status/1570580979734953987

అర్కైవ్ లింకు: https://web.archive.org/web/20220916122912/https://mobile.twitter.com/ErikSolheim/status/1570580979734953987

నిజ నిర్ధారణ:

వీడియో భారతదేశంలో నీటి రహదారిని చూపుతుందనే వాదన అబద్దం. ఈ వీడియో చైనాలోని యోంగ్‌సియు-వుచెంగ్ రహదారిని చూపుతుంది.

వీడియో నుండి సంగ్రహించబడిన కీఫ్రేమ్‌లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి శోధించినప్పుడు, రెడ్డిట్ లో అదే మ్యూజిక్ తో పాటు అదే వీడియో షేర్ అయ్యిందని తెలుస్తోంది. జూలై 2022లో "యాంగ్‌సియు వుచెంగ్‌లోని వరదలతో నిండిన హైవే, స్పిరిటెడ్ అవే వైబ్‌లతో" అనే శీర్షికతో వీడియో షేర్ అయ్యింది.

https://www.reddit.com/r/BeAmazed/comments/w385g2/this_flooded_highway_in_yongxiu_wucheng_with/

పీపుల్స్ డైలీ ఆఫ్ చైనా చేసిన మరొక ఫేస్ బుక్ పోస్ట్‌, అలాగే ట్వీట్ "టేక్ ఎ డ్రైవ్ ఆన్ రోడ్ అండర్ వాటర్, 18.67 మీటర్ల నీటి మట్టం ఉండే వరద సీజన్‌లో యోంగ్‌సియు-వుచెంగ్ రోడ్‌లోని కొంత భాగం నీటిలో మునిగి ఉన్న రోడ్డు #amazingchina" శీర్షికతో లభించింది!

Full View


ఈ పోస్ట్ నుండి క్యూ తీసుకొని, మేము శోధనకు "యాంగ్జిఉ వుచెంగ్" అనే కీవర్డ్ లను జోడించగా యాంగ్జిఉ వుచెంగ్ రహదారిలోని డహుచి విభాగం గురించి ప్రస్తావించిన కథనాలను కనుగొన్నాము.

Full View

డేంజరస్‌రోడ్స్.ఆర్గ్‌లోని కథనం ప్రకారం, ఈ రహదారి దాదాపు ప్రతి సంవత్సరం ముంపునకు గురవుతుంది, ఎందుకంటే ఇది పోయాంగ్ సరస్సు మీదుగా నిర్మించబడింది. ప్రపంచవ్యాప్తంగా క్రమానుగతంగా వరదలు వచ్చే రోడ్లలో ఇది ఒకటి. ఇది 29.9 కిమీ (18.57 మైళ్ళు) పొడవు ఉంది. వర్షాకాలం ప్రారంభంతో, ప్రతి సంవత్సరం మే చివరి నాటికి సరస్సులో నీటి మట్టం పెరిగి రోడ్డు ముంపుకు గురవుతుంది.

ఆ తర్వాత కొన్ని నెలలుగా ఈ రోడ్డు నీటిలోనే ఉంటుంది. సరస్సు నీటిమట్టం పెరగడంతో, రహదారి క్రమంగా వరదలతో నిండిపోతుంది. డ్రైవర్లు రోడ్డు పై భాగాన్ని చూడలేనప్పటికీ, వారు ఇరువైపులా ఏర్పాటు చేసిన గార్డు పట్టాలను అనుసరిస్తూ రహదారిపై డ్రైవ్ చేస్తారు. నీటిమట్టం పెరుగుతుండడంతో కొద్దిరోజుల తర్వాత రోడ్డు మొత్తం నీటమునిగింది. చివరికి, కొన్ని నెలల తర్వాత, రహదారి మళ్లీ కనిపిస్తుంది.

2019లో, రోడ్డులో మునిగిపోయిన రహదారిని చూపించే వరుస చిత్రాలు అనేక పబ్లికేషన్‌లలో ప్రచురించబడ్డాయి.

http://www.china.org.cn/photos/2019-06/25/content_74919115.htm

సిజిటిఎన్.కాం ప్రకారం, పోయాంగ్ సరస్సులో నీటి-మట్టం ప్రతి సంవత్సరం జూన్, జూలైలో 18.67 మీటర్లకు చేరుకుంటుంది, దీని వలన యోంగ్‌క్సియు-వుచెంగ్ రోడ్‌లో కొంత భాగం ముంపునకు గురవుతుంది. ఇది "అండర్ వాటర్ హైవే" దృశ్యాన్ని చూపిస్తుంది.

అందువల్ల, వీడియోలో కనిపించే నీటిలో మునిగిన రహదారి భారతదేశానికి చెందినది కాదు, ఇది చైనాలోని యోంగ్సియు-వుచెంగ్ రహదారి, ఇది పోయాంగ్ సరస్సుపై నిర్మించబడింది, పోయాంగ్ సరస్సు వరదల కారణంగా ప్రతి సంవత్సరం కొన్ని నెలలు మునిగిపోతుంది.

Claim :  Water highway video shared by Norwegian diplomat is from India
Claimed By :  Twitter Users
Fact Check :  False
Tags:    

Similar News