ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కాదు

ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా రేఖా గుప్తా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు;

Update: 2025-02-21 05:50 GMT
ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కాదు
  • whatsapp icon

ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా రేఖా గుప్తా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనా ఆమె చేత ప్ర‌మాణం చేయించారు. అలాగే మంత్రులుగా ప‌ర్వేశ్ శ‌ర్మ‌, సాహిబ్ సింగ్‌, అశీశ్ సూద్‌, మంజీంద‌ర్ సింగ్‌, ర‌వీంద‌ర్ ఇంద్ర‌జ్ సింగ్, క‌పిల్ మిశ్రా, పంక‌జ్ కుమార్ సింగ్ ప్ర‌మాణం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు హాజ‌ర‌య్యారు.

ఇటీవల ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో, బీజేపీ 48 స్థానాలతో నిర్ణయాత్మక విజయం సాధించింది, ఆప్ 22 స్థానాలకు పరిమితమైంది. రాజధానిలో ఆప్ దశాబ్దాల పాలనకు బీజేపీ ముగింపు పలికింది. ముఖ్యమంత్రి పదవికి పలువురి పేర్లు వినిపించినా రేఖా గుప్తా పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది.

రేఖా గుప్తా ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే సీఎం పదవిని చేపట్టారు. రేఖా గుప్తా ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా, జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు. ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యురాలిగా పని చేశారు. 1992లో ఆమె రాజకీయ ప్రయాణం మొదలైంది. దౌలత్ రామ్ కాలేజ్ లో చదువుతున్నప్పుడు ఏబీవీపీలో చేరారు. ఆ తర్వాత 1996-97లో ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలు అయ్యారు. 2007లో ఆమె నార్త్ పీతంపురా నుంచి కౌన్సిలర్ గా గెలుపొందారు.

హర్యానాలోని జింద్‌లో జన్మించిన రేఖా గుప్తా రాజకీయ ప్రయాణం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విద్యార్థి విభాగం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుండి సాగింది. ఓ మహిళ తన కత్తితో విన్యాసాలు చేస్తున్నట్లు చూపించే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Full View


Full View






వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు

వైరల్ వీడియోలోని కీ ఫ్రేమ్స్ ను తీసుకుని మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. మాకు మరాఠీ నటి పాయల్ జాదవ్ సోషల్ మీడియా ఖాతాలలో అసలు వీడియో కనిపించింది.

పాయల్ జాదవ్ షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఫిబ్రవరి 19 నాటి పోస్ట్ లో మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీకి నివాళి అర్పించిందామె.

తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యానికి మహారాష్ట్రలోని శిక్షణా సంస్థ “సవ్యసాచి గురుకులం” కారణం అని తెలిపింది.

"शिवरायांचे आठवावे रूप ।
शिवरायांचा आठवावा प्रताप ।
शिवरायांचा आठवावा साक्षेप ।
भूमंडळी ।।१।।

छत्रपती शिवाजी महाराजांच्या थोर कर्तुत्वाला नमन. शस्त्रास्त्रशास्त्रपारंगत, प्रौढप्रतापपुरंदर अशा थोरल्या महाराजांकडून प्रेरणा घेत केलेला हा माझा छोटा प्रयत्न.

हर हर महादेव!!

युद्धकला प्रशिक्षण - @savyasachi_gurukulam" అంటూ పోస్టు పెట్టింది.



ఈ వీడియోలో పాయల్ జాదవ్ ఒక కొలను నుండి నీటిని తీసుకుని వచ్చి, ముగ్గు పెట్టి, ఆయుధాలకు పూజ చేసి తనకు తెలిసిన యుద్ధ విద్యలను ప్రదర్శించడం చూడొచ్చు. ఈ వీడియో ఎప్పటిదో కూడా కాదు. ఇటీవల పోస్టు చేసిన వీడియో. 

పాయల్ జాదవ్ మరాఠీ చలనచిత్ర పరిశ్రమలో ఎదుగుతున్నారు. 2023 లో బాప్లియోక్‌ సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేసింది. ఆమె టీవీ సిరీస్ మాన్వత్ మర్డర్స్‌లో కూడా కనిపించింది. త్రీ ఆఫ్ అస్ చిత్రంలో చిన్న పాత్రను కూడా పోషించింది. జాదవ్ లలిత్ కళా కేంద్రం నుండి భరతనాట్యంలో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉంది. ప్రఖ్యాత కళాకారిణి అశ్విని ఎక్బోటే శిష్యురాలు.

పాయల్ జాదవ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఇలాంటి వేషధారణలో అంతకు ముందు కూడా పోస్టులు పెట్టారు.



వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కథనాలను కూడా ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.


కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.


Claim :  వైరల్ వీడియోలో ఉన్నది నటి పాయల్ జాదవ్
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News