ఫ్యాక్ట్ చెక్: రాహుల్ గాంధీతో ఉన్న మహిళ స్నేహితుడి భార్య, ఫోటో ఇటీవలి ది కాదు
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయనకు ఇండియన్ ఓవర్‌సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయనకు ఇండియన్ ఓవర్‌సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా, భారతీయ ప్రవాస సభ్యులు స్వాగతం పలికారు. రాహుల్ గాంధీ డల్లాస్, వాషింగ్టన్ DCని సందర్శిస్తున్నారు. అక్కడ విద్యావేత్తలు, విద్యార్థులు, కమ్యూనిటీ వ్యక్తులతో మాట్లాడారు. పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు రాహుల్ గాంధీ. భారతదేశంలోని కులం, కోటా వ్యవస్థ వంటి సమస్యలపై ఆయన అమెరికా నుండి కీలక వ్యాఖ్యలు చేశారు. కుల గణన జరగాలని, అట్టడుగు వర్గాల ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవాలని తాను భావిస్తూ ఉన్నానన్నారు.
ఇంతలో, రాహుల్ గాంధీ, సామాను, ట్రాలీ బ్యాగ్‌లతో విమానాశ్రయం వెలుపల ఉన్న చిత్రం వైరల్ అవుతూ ఉంది. ఆయన పక్కన ఉన్న మహిళ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె అమృత్ సింగ్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఆ చిత్రంలో మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. “Hi #RaulVinci. Where were you traveling with Amrit Singh, Director, Accountability, Liberty and Transparency of Open Society Justice Initiative - a project funded by George Soros?” అంటూ పోస్టులు పెడుతున్నారు. రాహుల్ గాంధీ ఎక్కడికి ప్రయాణం చేస్తున్నావు. లిబర్టీ అండ్ ట్రాన్స్‌పరెన్సీ ఆఫ్ ఓపెన్ సొసైటీ జస్టిస్ ఇనిషియేటివ్ డైరెక్టర్ అమృత్ సింగ్ తో కలిసి రాహుల్ ప్రయాణం చేస్తున్నారని అన్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ ఫోటోలో కనిపిస్తున్న మహిళ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె అమృత్ సింగ్ కాదు. మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి వైరల్ ఇమేజ్‌ని సెర్చ్ చేయగా, అక్టోబర్ 2023లో పలు వెబ్‌సైట్‌లలో ప్రచురించిన కొన్ని నివేదికలను మేము కనుగొన్నాము.
"రాహుల్‌గాంధీ రహస్యంగా ఎందుకు దేశాన్ని విడిచిపెట్టారు. ఉజ్బెకిస్తాన్ కు ఎందుకు వెళ్లారు?" వంటి క్యాప్షన్‌లతో ట్రోల్ చేస్తూ వైరల్ ఫోటో షేర్ చేశారని మేము కనుగొన్నాము.
ఫ్రీ ప్రెస్ జర్నల్‌లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆకుపచ్చ టీ-షర్ట్‌లో కనిపించిన చిత్రాలను X (ట్విట్టర్)లో పంచుకున్నారు. అతను ఉజ్బెకిస్తాన్‌లో ఆకస్మిక పర్యటనలో ఎందుకు ఉన్నారు అంటూ, గోధుమ రంగు చొక్కా ధరించిన మహిళ ఎవరు అంటూ యూజర్లు ప్రశ్నించారు. అయితే రాహుల్ తన చిన్ననాటి స్నేహితుడు అమితాబ్ దూబే, ఆయన భార్య అమూల్యతో ఉన్నారని కథనం పేర్కొంది.
చిత్రంలో ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ చిన్ననాటి స్నేహితుడు అమితాబ్ దూబే అని, ఆ మహిళ అమితాబ్ భార్య అమూల్య అని తెలుపుతున్న కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాటే చేసిన పోస్ట్‌ను కూడా మేము కనుగొన్నాము.
అమితాబ్ దూబే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ బోర్డ్ మెంబర్, మాజీ పీఎం రాజీవ్ గాంధీకి ప్రెస్ అడ్వైజర్‌గా ఉన్న సుమన్ దూబే కుమారుడని పేర్కొంటూ Xలో మరో పోస్ట్ కూడా కనిపించింది.
అందువల్ల, వైరల్ చిత్రంలో ఉన్నది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె అమృత్ సింగ్ కాదు. అంతేకాకుండా రాహుల్ గాంధీ ఇటీవలి USA ప్రయాణానికి సంబంధించినది కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : రాహుల్ గాంధీ అమృత్ సింగ్‌తో కలిసి విదేశాలకు వెళ్లడం కనిపించింది.
Claimed By : Twitter users
Fact Check : False