ఫ్యాక్ట్ చెక్: షారుఖ్ ఖాన్ 'పఠాన్' సినిమాకు వ్యతిరేకంగా యోగి ఆదిత్యనాథ్ ప్రకటన చేశారా..?

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌ను విమర్శించిన వీడియో అంటూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షారుఖ్ ఖాన్ భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారని, దేశంలోని మెజారిటీ సమాజం

Update: 2022-04-11 03:50 GMT

క్లెయిమ్: షారుఖ్ ఖాన్ 'పఠాన్' సినిమాను చూడకండని యోగి ఆదిత్యనాథ్ అన్నారు

ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.. ఈ వీడియో 2015 నుండి వైరల్ అవుతూనే ఉంది


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌ను విమర్శించిన వీడియో అంటూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షారుఖ్ ఖాన్ భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారని, దేశంలోని మెజారిటీ సమాజం (హిందూ) ఆయన సినిమాలను బహిష్కరిస్తే ఇతర ముస్లింల మాదిరిగానే అతను కూడా రోడ్డుపైకి వస్తాడని యోగి ఆదిత్యనాథ్ అన్నట్లుగా వీడియో వైరల్‌గా మారింది. షారుఖ్‌ ఖాన్‌కు, ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌కు భాషలో కూడా తేడా లేదని అన్నారు. అంతేకాకుండా ఈ క్లిప్‌ను షేర్ చేస్తూ షారుక్ ఖాన్ రాబోయే చిత్రం పఠాన్‌ను బహిష్కరించాలని యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేసినట్లు సోషల్ మీడియా యూజర్లు పేర్కొన్నారు.

ఒక ట్విట్టర్ యూజర్ ఈ క్లిప్ పంచుకున్నారు, హిందీలో శీర్షిక వ్రాసాడు "माननीय मुख्यमंत्री जी का ऐलान शाहरुख की जेहादी मूवी 'पठान' का करे बहिष्कार | शाहरुख खान की 'पठान' मूवी ना देखने के लिए बाबा जी का संदेश |" చివరి వరకూ వినండి అని చెప్పారు.
[అనువాదం: గౌరవనీయులైన ముఖ్యమంత్రి షారుఖ్ జిహాదీ చిత్రం 'పఠాన్'ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. షారుఖ్ ఖాన్ 'పఠాన్' సినిమా చూడవద్దని బాబాజీ సందేశం. చివరి వరకు శ్రద్ధగా వినండి.]

ఇదే క్లెయిమ్‌తో ఈ వీడియో ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో వైరల్‌గా మారింది.

ఫ్యాక్ట్ చెకింగ్:

బృందం దావాను ధృవీకరించింది మరియు అది తప్పు అని గుర్తించింది. వైరల్ వీడియో 2015 నాటిది.

వీడియోను గమనించినప్పుడు, మేము వార్తా సంస్థ ANI యొక్క లోగోను చూశాము. మేము ఓపెన్ కీవర్డ్ సెర్చ్ చేసాము. 04 నవంబర్ 2015 నాటి ANI చేసిన ట్వీట్‌ వీడియోను కనుగొన్నాము. వైరల్ వీడియోలో కనిపించే ఇలాంటి ఫుటేజీని చూడవచ్చు. 'షారూఖ్‌ ఖాన్‌పై బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్‌ చేసిన ప్రకటన' అని ట్వీట్‌లో క్యాప్షన్‌ ఉంది. "BJP leader Yogi Adityanath's statement on Shah Rukh Khan." అన్నది ట్వీట్.
మరింత సెర్చ్ చేయగా.. మేము 04 నవంబర్ 2015 నాటి ANI అధికారిక YouTube హ్యాండిల్‌లో వైరల్ వీడియోకు సంబంధించి లాంగ్ వీడియోను కనుగొన్నాము. వీడియో యొక్క శీర్షిక, ("ఆదిత్యనాథ్ షారుక్‌ను హఫీజ్ సయీద్‌తో పోల్చాడు") "Adityanath compares Shahrukh to Hafiz Saeed." అని ఉంది.

వీడియో సందర్భాన్ని వెతికితే, 2015లో షారుఖ్ ఖాన్ అసహనం(intolerance) మీద చేసిన ప్రకటన కారణంగా వివాదం తలెత్తిందని మేము కనుగొన్నాము. భారత్‌లో అసహనం పెరిగిపోతోందని చెప్పిన షారుఖ్.. తర్వాత తన ప్రకటనను తప్పుగా చిత్రీకరించారని స్పష్టం చేశారు. షారూఖ్
ఈ ప్రకటన తర్వాత
, యోగి ఆదిత్యనాథ్‌తో సహా చాలా మంది బీజేపీ నాయకులు అతన్ని లక్ష్యంగా చేసుకుని హఫీజ్ సయీద్‌తో పోల్చారు.
Full View
యోగి ఆదిత్యనాథ్ షారుఖ్ ఖాన్‌ను విమర్శిస్తూ హఫీజ్ సయీద్‌తో పోల్చిన వైరల్ వీడియో ఇటీవలిది కాదని, 2015 నాటిదని మా పరిశోధనలో తేలింది. షారూఖ్ ఖాన్ చిత్రం 'పఠాన్'ను బహిష్కరించాలని యోగి ఆదిత్యనాథ్ కోరినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోంది. షారుఖ్ ఖాన్ చిత్రం 'పఠాన్' సినిమా 2023లో విడుదల కానుంది. కాబట్టి వైరల్ వాదన తప్పు.


క్లెయిమ్: షారూఖ్ ఖాన్ చిత్రం 'పఠాన్'ను బహిష్కరించాలని యోగి ఆదిత్యనాథ్ కోరినట్లు ప్రచారం
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim :  Yogi Adityanath appealed to boycott Shah Rukh Khan's upcoming film Pathan.
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News