నిజ నిర్ధారణ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి అమెరికన్లు, వారి పిల్లలను పంపాలని జెలెన్స్కీ డిమాండ్ చేయలేదు

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పాల్గొనడానికి వారి కుమారులు, కుమార్తెలను పంపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికన్లను డిమాండ్ చేస్తున్నారంటూ ఒక వీడియో క్లిప్ షేర్ అవుతోంది.

Update: 2023-03-08 02:07 GMT

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పాల్గొనడానికి వారి కుమారులు, కుమార్తెలను పంపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికన్లను డిమాండ్ చేస్తున్నారంటూ ఒక వీడియో క్లిప్ షేర్ అవుతోంది.

ట్విట్టర్ వినియోగదారులు ఈ వీడియో క్లిప్‌ క్యాప్షన్‌ ఇలా ఉంది: “జెలిన్‌స్కీ: భూయుద్ధంలో పోరాడటానికి ఉక్రెయిన్‌కు యువ అమెరికన్లు అవసరం. "యూఎస్ వారి కుమారులు & కుమార్తెలను... యుద్ధానికి పంపవలసి ఉంటుంది..." "....మరియు వారు చనిపోతారు."

నిజ నిర్ధారణ:

క్లెయిం అవాస్తవం. వీడియో రెండు గంటల పాటు లైవ్ స్ట్రీమ్ చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ క్రాప్డ్ వెర్షన్.

వైరల్ క్లిప్‌ను విశ్లేషిస్తున్నప్పుడు, దాని కుడి ఎగువ మూలలో వాటర్‌మార్క్ ఉన్నట్లు గమనించవచ్చు. దానిని క్యూగా తీసుకొని, ఛానెల్ కోసం శోధిస్తున్నప్పుడు, ఈ వీడియో టెలిగ్రాఫ్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ ప్రచురించిన 2 గంటల సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భాగమని తెలుస్తోంది. పత్రికా ప్రతినిధులు, ఉక్రెయిన్ అధ్యక్షుడి మధ్య జరిగిన సంభాషణను ప్రత్యక్షంగా ఆంగ్లంలోకి అనువదించారు.

Full View

డిడబ్లు న్యూస్ ప్రచురించిన మరొక ప్రత్యక్ష ప్రసార వీడియో ఇక్కడ ఉంది, ఇక్కడ యుక్రెయిన్ అధ్యక్షుడు నిర్వహించిన విలేకరుల సమావేశ ప్రత్యక్ష ప్రసార లింకు ను చూడవచ్చు.

Full View

రష్యాతో యుక్రెయిన్ యుద్ధానికి మొదటి వార్షికోత్సవం సందర్భంగా యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ వీడియో ఫిబ్రవరి 24, 2023న ప్రత్యక్ష ప్రసారం జరిగింది. వైరల్ వీడియో, టెలిగ్రాఫ్ యూట్యూబ్ ఛానెల్ ప్రచురించిన వీడియోను పోల్చి చూస్తే, రెండు వీడియోల నేపథ్యం ఒకేలా ఉందని మనం చూడవచ్చు.

 

"యునైటెడ్ స్టేట్స్‌లో ఒపీనియన్ పోల్‌లు అమెరికా యుక్రెయిన్ కు ఎక్కువ మద్దతు ఇస్తోందని చాలా మంది అమెరికన్లు విశ్వసిస్తున్నట్లు ఎలా సూచిస్తున్నాయి. అమెరికన్లకు సందేశం ఏమిటి?" అని పత్రికా ప్రతినిధుల ప్రశ్నకు జెలెన్స్కీ సమాధానమిస్తున్నట్లు కాన్ఫరెన్స్ వీడియో చూపిస్తుంది.

అతను అమెరికన్ల మద్దతు కోసం కృతజ్ఞతలు తెలుపుతూ తన సమాధానాన్ని ప్రారంభించాడు, ఆపై యుక్రెయిన్ యుద్ధంలో ఓడిపోతే ఏమి జరుగుతుందో చెప్పడం కొనసాగించారు. జెలెన్స్కీ ఇలా అంటాడు, “నాటో కూటమిలో భాగమైన బాల్టిక్ రాష్ట్రాల్లో రష్యా ప్రవేశిస్తే, యుఎస్ వారి కుమారులు, కుమార్తెలను యుద్ధానికి పంపవలసి ఉంటుంది, వారు పోరాడవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది నాటో, వారు చనిపోతారు, ఇది భయంకరమైన విషయం.

ఉక్రెయిన్ అధ్యక్షుడు రష్యా ఉక్రెయిన్‌ను ఓడించి బాల్టిక్ రాష్ట్రాల్లోకి ప్రవేశించే ఊహాజనిత పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు, అయితే ఉక్రెయిన్ కోసం పోరాడటానికి వారి కుమారులు, కుమార్తెలను పంపమని అమెరికాను డిమాండ్ చేయడం లేదు.

కాబట్టి, క్లెయిం అవాస్తవం. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనేందుకు యువ సైనికులను పంపాలని అతను అమెరికాను డిమాండ్ చేయడం లేదు.

Claim :  Ukrainian president demanding US to send troops to Ukraine
Claimed By :  Twitter Users
Fact Check :  False
Tags:    

Similar News