Teeth: రోజుకు ఎన్నిసార్లు బ్రష్ చేయాలి? ఎంతసేపు తొమితే మంచిది?
Healthy Teeth: మనం రోజూ ఉదయం నిద్ర లేవగానే చేసే పని పళ్లు తోముకోవడం. ఇది ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం.;
Healthy Teeth: మనం రోజూ ఉదయం నిద్ర లేవగానే చేసే పని పళ్లు తోముకోవడం. ఇది ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం. పళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. అయితే పళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సరిగ్గా తోమకుంటే పళ్లు పుచ్చిపోయే ప్రమాదం ఉంది. అంతే కాదు వివిధ అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని డెంటిస్ట్‌లు చెబుతున్నారు. బ్రషింగ్ వల్ల మనకు సంపూర్ణ ఆరోగ్యం కూడా సొంతమవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం పళ్లు-చిగుళ్ల సమస్యలతో పాటు గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్.. వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే బ్రష్ చేసుకునే విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు ఉంటుంది. దంతాలు మెరిసిపోవాలంటే ఎక్కువ సేపు బ్రష్ చేసుకోవాలని, బ్రషింగ్‌కి బదులుగా మౌత్‌వాష్ వాడచ్చని, పళ్లు తోముకోవడానికి హార్డ్ బ్రష్ అయితేనే మంచిదని భావిస్తుంటారు. అలాగే నోటి ఆరోగ్యం విషయంలో ఇలా ఎవరి ఆలోచనలు వారివి. మరి, ఇవన్నీ నిజమేనా? నోటి ఆరోగ్యంపై పలువురిలో ఉండే కొన్ని అపోహలు, నిజాలు ఏంటో తెలుసుకుందాం.
రోజుకు ఎన్నిసార్లు బ్రష్ చేయాలి? ఎంతసేపు చేసుకోవాలి?
మనం రోజూ ఉదయం నిద్ర లేవగానే చేసే పని పళ్లు తోముకోవడం. దీని ద్వారా రోజంతా దంతాల్ని, నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. అంతేకాదు.. బ్రషింగ్ వల్ల మనకు సంపూర్ణ ఆరోగ్యం కూడా సొంతమవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం పళ్లు-చిగుళ్ల సమస్యలతో పాటు గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్.. వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడక తప్పదంటున్నారు. అందుకే నోటి ఆరోగ్యమే సంపూర్ణ ఆరోగ్యమని చెబుతున్నారు. ఇదిలా ఉంటే బ్రష్ చేసుకునే విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. దంతాలు మెరిసిపోవాలంటే ఎక్కువ సేపు బ్రష్ చేసుకోవాలని, బ్రషింగ్‌కి బదులుగా మౌత్‌వాష్ వాడచ్చని, పళ్లు తోముకోవడానికి హార్డ్ బ్రష్ అయితేనే మంచిదని.. నోటి ఆరోగ్యం విషయంలో ఇలా ఎవరి ఆలోచనలు వారివి. మరి, ఇవన్నీ నిజమేనా? నోటి ఆరోగ్యంపై పలువురిలో ఉండే కొన్ని అపోహలు, వాటి వెనకున్న అసలు నిజాలేంటో తెలుసుకుందాం..!
చేపను రుద్దినట్లు రుద్దకూడదు:
ముందుగా ఉదయం నిద్రలేవగానే బ్రష్ నిండా టూత్‌పేస్ట్ పెట్టుకుని దంతాలను చేపలను రుద్దినట్లు రుద్దేస్తుంటాము. ఇలా చేస్తే దంతాలు మెరిసిపోతాయని భావిస్తుంటారు. ఇలా చేయడం సరైన పద్దతి కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా రుద్దడం వల్ల పళ్లపై ఉండే ఎనామిల్ పొర తొలగిపోయి నోటి సమస్యలు తలెత్తుతాయని సూచిస్తున్నారు. ఇష్టానుసారంగా ఏదో హడావుడిగా శుభ్రం చేసుకుంటే నోటి సమస్యలు రావడం ఖాయమంటున్నారు నిపుణులు.
ఉదయం ఒకసారి బ్రష్ చేసుకుంటే సరిపోతుందా?
చాలా మంది ఉదయం లేవగానే పళ్లను సరైన పద్దతిలో బ్రష్ చేసుకోరు. బద్దకస్తులు చాలా మంది ఉంటారు. బ్రష్ చేసే విధానంలో ఏదో కానిచ్చేసిట్లు ఉంటారు. అలా చేయడం అనారోగ్య సమస్యలు తెచ్చుకున్నట్లేనని దంత వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజులో ఒకసారి పళ్లను తోముకుంటే సరిపోతుందని చాలా మంది అనుకుంటారు. కొందరేమో ఉదయం, రాత్రి రెండు సార్లు బ్రష్ చేసుకుంటారు. ఇలా రెండు సార్లు బ్రష్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. దీని ద్వారా నోటికి, పళ్లకు సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటుందని అంటున్నారు.
రోజుకు ఎన్నిసార్లు బ్రష్ చేసుకోవాలి..?
హార్డ్‌బ్రష్ ఉండే గరుకైన బ్రిజల్స్ వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ పొర తొలగిపోయే ప్రమాదం ఉంది. అలాగని మృదువైన బ్రిజిల్స్ ఉండే బ్రష్ ఉపయోగించడం వల్ల దంతాలు అంతగా శుభ్రపడకపోవచ్చు. క్రమం తప్పకుండా పళ్ళు తోముకోవడం వల్ల చిగుళ్ల వ్యాధి, కావిటీస్, నోటి దుర్వాసన నిరోధిస్తుంది. అయితే, చాలా మంది పళ్లు తోముకోవాల్సినంతగా బ్రష్ చేయరు. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ప్రజలు రోజుకు రెండుసార్లు రెండు నిమిషాల పాటు పళ్ళు తోముకోవాలని సిఫార్సు చేస్తున్నారు. క్రమం తప్పకుండా బ్రష్ చేసే వ్యక్తులు ఆరోగ్యకరమైన, బలమైన దంతాలు కలిగి ఉంటారని, మీ దంతాలను బ్రష్ చేయడం వల్ల పంటి ఎనామెల్ ఉపరితలం నుండి ఉండే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఇది దంత క్షయం, చిగుళ్ల వ్యాధులను నివారిస్తుంది.
ఆరు నెలలకోసారి దంత పరీక్షలు:
నోరు వందలాది బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులకు నిలయం. రెగ్యులర్ డెంటల్ చెకప్‌లు ఆరోగ్యకరమైన నోటిని కాపాడతాయి. అలాగే భవిష్యత్తులో దంత సమస్యలను నివారిస్తాయి. కనీసం ఆరు నెలలకు ఒకసారి దంత పరీక్షకు వెళ్లడం మంచిదని అమెరికన్ డెంటల్ అసోసియేషన్ సూచిస్తోంది. ఇలా రెగ్యుల్‌గా దంతాలను చెక్ చేసుకోవడం వల్ల దంత సమస్యలను నివారించవచ్చని చెబుతున్నారు నిపుణులు. సాధారణ రోజువారీ దినచర్య అనేక నోటి ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. చాలా గట్టిగా బ్రష్ చేసే వ్యక్తులు చిగుళ్ల సమస్యలు, దంతాల సున్నితత్వాన్ని ఎదుర్కొంటారు. ఇది చిగుళ్లలో రక్తస్రావం కూడా కలిగిస్తుంది.
ఇలా చేస్తే చిగుళ్ల వ్యాధి నివారించవచ్చు:
మీరు ఎంత తరచుగా బ్రష్ చేస్తున్నారో ముఖ్యం కాదు. మీరు ఎలా బ్రష్ చేస్తారు అనేది చాలా ముఖ్యం. పళ్లను గట్టిగా కాకుండా సున్నితంతా, అన్ని వైపుల బ్రష్‌ను క్రమపద్దతిలో తోమడం వల్ల చిగుళ్ల వ్యాధి, దంత క్షయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీ దంతాలను గట్టిగా బ్రష్ చేయడం వల్ల మీ దంతాలు తెల్లగా మారవని గుర్తించుకోండి. నోటి పరిశుభ్రతలో టూత్‌పేస్ట్ అవసరం. ఫ్లోరైడ్ టూత్ పేస్టు ఉత్తమమైనది. ఫ్లోరైడ్ ఖనిజం దంతాల ఎనామిల్‌ను బలపరుస్తుంది. దంత క్షయాన్ని నివారిస్తుంది. నోటి పరిశుభ్రతలో టూత్‌పేస్ట్ అవసరం. ఫ్లోరైడ్ టూత్ పేస్టు అక్కడ ఉత్తమమైనది. ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ ప్రతిరోజూ కనీసం 2 నిమిషాలు మీ దంతాలను బ్రష్ చేస్తే ప్రభావవంతంగా ఉంటుంది.
నాలుకను శుభ్రం చేసుకోండి:
పళ్ళు తోముకోవడం మనం ప్రతి రోజూ చేసే పని. అయినప్పటికీ, మనలో చాలా మంది నాలుకను, మీ బుగ్గల లోపల బ్రష్ చేయడానికి సమయం తీసుకోరు. మీ నాలుక, బుగ్గల లోపల బ్రష్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఇక్కడ శుభ్రం చేసుకోవడం వల్ల నోటి దుర్వాసనను నివారిస్తుంది. మీ నోటిలో ఆహార పదార్థాలు చిక్కుపోవడం వల్ల కావిటీని నివారిస్తుంది. మీరు చిగుళ్ల వ్యాధి, దంత క్షయం కలిగించే బ్యాక్టీరియాను వదిలించుకోవచ్చు.
టూత్ బ్రష్‌ను సరిగ్గా పట్టుకోండి :
చాలా మంది వ్యక్తులు తమ టూత్ బ్రష్‌లను కింద లేదా ఓవర్‌హ్యాండ్‌లో పట్టుకుంటారు. ఈ రెండు పద్ధతులు సరికాదు. మీ చిగుళ్ళ వైపు చూపిస్తూ 45 డిగ్రీల కోణంలో ఉంచడం సరైన మార్గమని దంత వైద్యులు సూచిస్తున్నారు. పెన్సిల్ లాగా దాన్ని సూటిగా పట్టుకోకండి. మీ దంతాల అన్ని ఉపరితలాలను తాకడానికి 30-డిగ్రీల కోణం సరైనది. వృత్తాకార కదలికలో ప్రతి దంతాల పైభాగం, దిగువ వైపులా బ్రష్ చేయండి. మీ దంతాల ముందు మాత్రమే దృష్టి పెట్టవద్దు. లోపలి భాగాలు కూడా ముఖ్యమైనవి. మీ టూత్ బ్రష్‌ను తప్పుగా పట్టుకోవడం వల్ల చాలా దంత సమస్యలు వస్తాయి. బ్రష్ అన్ని వైపులా తాకేలా బ్రష్ చేసుకోవడం మంచిది. అలాగే మార్కెట్లో తక్కువ ధరల్లో నాణ్యత లేని బ్రష్‌లు లభిస్తున్నాయి. వాటిని కొనవద్దు. మంచి నాణ్యమైన బ్రష్‌ను వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.