మంకీపాక్స్ పేరు మార్పు
మంకీ పాక్స్ పేరును మారుస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది. ఎంపాక్స్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు;
మంకీ పాక్స్ పేరును మారుస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది. మంకీపాక్స్ పేరును ఎంపాక్స్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంకీపాక్స్ పేరు జాత్యాంహకారానికి కారణమవుతుందని పలు దేశాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. అనేక మంది ఆందోళన కూడా నిర్వహించారు.
అభ్యంతరాలతో..
దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ పేరును మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోని అనేక మంది నిపుణులతో సంప్రదించని అనంతరం దీనికి ఎం పాక్స్ గా నామకరణం చేసింది. ఏడాది పాటు ఈ రెండు పేర్లను వినియోగించనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఏడాది తర్వాత మంకీపాక్స్ కనుమరుగవుతుందని తెలిపారు.