పేట్రేగిపోయిన సైబర్ నేరస్తులు.. ఒక్కరోజులో 15 మంది అరెస్ట్

ఎస్ బీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ నంబర్ కోసం ఓ వ్యక్తి గూగుల్ లో సెర్చ్ చేశాడు. అది నకిలీ నంబర్ అని గుర్తించలేక..

Update: 2023-06-26 14:39 GMT

cyberabad cyber crime news

రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్ లో లోన్లు ఇచ్చి.. అధిక డబ్బు వసూలు చేసేవారు కొందరైతే.. నకిలీ కంపెనీల పేర్లతో ఉద్యోగాలిచ్చి.. వారి డాక్యుమెంట్లతో లోన్లు తీసుకునేవారు మరికొందరు, కస్టమర్ కేర్ అంటూ వినియోగదారులకు ఫోన్లు చేసి డబ్బులు కాజేసే కేటుగాళ్లు మరికొందరు. ఇలా రకరకాలుగా మోసాలకు పాల్పడిన 15 మంది సైబర్ నేరస్తులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు నుంచి అమాయకుల పేరిట రూ.4.38 కోట్లు రుణాలు తీసుకున్న 10 మందిని తొలుత పోలీసులు అరెస్ట్ చేశారు.

వీరంతా నకిలీ కంపెనీల పేరుతో ఉద్యోగాలిచ్చి.. వారి డాక్యుమెంట్లతో వ్యక్తిగత రుణాలు తీసుకున్నవారే. లోన్ వచ్చాక.. సదరు వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించి.. మళ్లీ మరొకరిని అపాయింట్ చేస్తూ.. మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 10 మందిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. మరో ఘటనలో క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చిక్కారు.
ఎస్ బీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ నంబర్ కోసం ఓ వ్యక్తి గూగుల్ లో సెర్చ్ చేశాడు. అది నకిలీ నంబర్ అని గుర్తించలేక.. ఆ నంబర్ కు ఫోన్ చేసి.. రివార్డ్ పాయింట్స్ గురించి అడిగాడు బాధితుడు. అతని మొబైల్ లో ఎనీ డెస్క్ యాప్ డౌన్ లోడ్ చేయించి.. అతని క్రెడిట్ కార్డు నుంచి రూ.16 వేలు కాజేశారు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఫోన్ నంబర్ ఆధారంగా నిందితులు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరిపై దేశవ్యాప్తంగా కేసులున్నట్లు గుర్తించామన్నారు. ఒక ముఠాగా ఏర్పడి.. ఫేక్ కస్టమర్ కేర్ నంబర్ తో ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News