Shirdi : తక్కువ ఖర్చుతో షిర్డీ వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఐఆర్టీసీ సూపర్ ప్యాకేజీ

రైల్వే శాఖ షిర్డీ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.;

Update: 2025-01-05 06:21 GMT

రైల్వే శాఖ షిర్డీ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ఖర్చుతో షిర్డీ కి వెళ్లి వచ్చే ప్యాకేజీని ఐఆర్టీసీ ప్రకటించింది. ఈ టూరిజం ప్యాకేజీతో గతంలో కంటే తక్కువ ఖర్చుతో షిర్డీ సాయినాధుని దర్శించుకుని వచ్చే అవకాశముంటుంది. హైదరాబాద్ నుంచి ఈ రైళ్లు నడుస్తాయి. ఈ ప్యాకేజీలో షిర్డీకి వెళ్లాలనుకునే వారు ఐఆర్టీసీ వెబ్ సైట్ లోకి వెళ్లి సాయి శివమ్ ప్యాకేజీని చూస్తే పూర్తి వివరాలు లభిస్తాయి. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ టూర్ ప్యాకేజీ ఉంటుంది. జనవరి పదో తేదీన రైలు హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. ముందుగా బుక్ చేసుకునే వారికే మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది.



ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి...

https://www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. షిర్డీ సాయినాధుని దర్శనంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలను కూడా చూపిస్తారు. నాసిక్, త్రయంబకేశ్వరం కూడా చూపిస్తారు. సింగిల్ షేరింగ్ 8,840 రూపాయలుగా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ ధరను 7470, ట్రిపుల్ షేరింగ్ ధరను 7,450 రూపాయలుగా నిర్ణయించారు. నాలుగు రోజుల పాటు ఈ ట్రిప్ ఉంటుంది. నాలుగు రోజులు అల్పాహారం, వసతి, భోజనం వంటివి ఉచితంగా కల్పిస్తారు. కాచిగూడ నుంచి ఈ ట్రైన్ బయలుదేరుతుంది.




Tags:    

Similar News