ఆ బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి

ఉద్యోగుల సహకారంతో మరిన్ని కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం

Update: 2023-12-16 02:33 GMT

HMDA Joint Metro politan Commissioner

హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌గా ఆమ్రపాలి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. హెచ్‌ఎండీఏ ఉద్యోగుల సహకారంతో మరిన్ని కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇచ్చిందని అన్నారు. హెచ్ఎండీఏ అధికారుల సహకారంతో ముందుకు సాగుతానన్నారు. హెచ్ఎండీఏ ఉద్యోగుల సహకారంతో మరిన్ని కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలి కాటా అన్నారు. ప్రభుత్వం తనకు అభివృద్ధి చేసే అవకాశం కల్పించిందని వ్యాఖ్యానించారు.


ఆమ్రపాలి బాధ్యతలు స్వీకరించిన సమయంలో హెచ్ఎండీఏ కార్యదర్శి చంద్రయ్య, చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, అర్బన్ పారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్, ఎస్టేట్ ఆఫీసర్ కిషన్ రావు, ప్లానింగ్ డైరెక్టర్లు విద్యాధర్, శ్రీనివాస్, లీగల్ స్పెషలిస్ట్ యశస్వి సింగ్‌లతో పాటు హెచ్ఎండీఏ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. జిహెచ్ఎంసి పరిధిలో ముగ్గురు కొత్త కమిషనర్లను సీఎం రేవంత్ రెడ్డి నియమించారు. నీటిపారుదల శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లబోతున్నారంటూ ప్రచారం జరిగినప్పటికీ.. ఆమె మంత్రి సీతక్క బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా ఆమ్రపాలికి రేవంత్ రెడ్డి సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించింది. దాంతో పాటు మూసీ డెవలప్మెంట్ సంస్థ ఇన్చార్జ్ ఎండిగా కూడా అదనపు బాధ్యతలను కేటాయించింది. ప్రస్తుతం ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా ఆమ్రపాలి పనిచేస్తున్నారు. ఒంగోలులోని అగ్రహారం గ్రామానికి చెందిన ఆమ్రపాలి 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో వికారాబాద్ సబ్ కలెక్టర్ గా, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ గా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ గా ఆమ్రపాలి పనిచేశారు.



Tags:    

Similar News