Chandrababu : రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లు లాంటివి

తెలుగు రాష్ట్రాల ప్రజలు రెండు కలసి ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు

Update: 2024-07-07 07:42 GMT

తెలుగు రాష్ట్రాల ప్రజలు రెండు కలసి ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు కలసి ముందుకు వెళ్లాలన్నారు. రెండు ప్రభుత్వాలు కలసి సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు వెళ్లాలని ఆయన పిలుపు నిచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు లాంటివని అన్నారు.

హైదరాబాద్ వాసులు...
ఎన్నికల్లో గెలుపునకు హైదరాబాద్ వాసులు కీలకమని అన్నారు. 2004 ముందు ఉద్యమ స్ఫూర్తితో పాలన సాగించామని తెలిపారు. ఎన్నారైలు విదేశాల నుంచి వచ్చి మరీ ఓటేసి గెలిపించారన్నారు. సైబరాబాద్ నిర్మాణంతో శరవేగంతో అభివృద్ధి జరిగిందని చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలోనూ బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు.


Tags:    

Similar News