బ్రేకింగ్: మంటల్లో అంకుర ఆసుపత్రి

హైదరాబాద్ మెహదీపట్నంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అంకుర ఆసుపత్రిలో;

Update: 2023-12-23 13:15 GMT
Hyderabad, PVNR, Expressway, FireAccident, crime news, telangana, hyderabad news, crime news, ankura hospital fire accident

ankura hospital

  • whatsapp icon

హైదరాబాద్ మెహదీపట్నంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అంకుర ఆసుపత్రిలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మంటలను ఆదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గుడిమల్కాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పై అంతస్తులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. మొత్తం భవనం 10 అంతస్తుల్లో ఉండగా టెర్రస్ లో మంటలు వ్యాపించాయి. టెర్రస్ పైన ప్లాస్టిక్ వస్తువులు, ఫ్లెక్సీలు ఉండటంతో మంటలు వేగంగా పక్కకు విస్తరించాయి. చిన్న పిల్లల ఆసుప్రతి కావడంతో ఆందోళన ఎక్కువైంది. మూడు అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పై అంతస్తులో మంటలు వ్యాపించడంతో నిప్పు రవ్వలు గాల్లో ఎగురుతూ కిందకు పడ్డాయి. అసుపత్రిలోని పేషెంట్లను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆసుపత్రి సిబ్బంది.



Tags:    

Similar News