Gold Price Today : పసిడి ప్రియులకు బంగారం ఇలా షాకిస్తున్నదేమిటి?
బంగారం, వెండి ధరలు ఆల్ టైం హైకి చేరుకుంటున్నాయి. రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి.;

బంగారం ధరలు ఆల్ టైం హైకి చేరుకుంటున్నాయి. రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలు తగ్గుతూ వచ్చినా రెండు రోజుల నుంచి ధరలు పెరుగుతూ వినియోగదారులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నారు. బంగారం ధరలు పెరగడం మామూలే అయినప్పటికీ ఇలా పెరుగుతూ పోతే గోల్డ్ అనేది కొంత మందికి మాత్రమే పరిమితమయ్యే అవకాశముంది. అదే సమయంలో చాలా మందికి బంగారం, వెండి వస్తువులు దూరం కానున్నాయి. అందులోనూ గోల్డ్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ప్రతి పండగ, శుభకార్యం, పెళ్లిళ్లకు బంగారం అనేది కంపల్సరీ కావడంతో ధరలు మరింతగా పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
ఏప్రిల్ నెలలో...
ఏప్రిల్ నెలలో మళ్లీ పెళ్లిళ్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ముహూర్తాలు పెట్టుకున్న వారంతా బంగారం కొనుగోలు చేయడానికి జ్యుయలరీ దుకాణాలకు వచ్చి ధరలను చూసి ఆందోళన చెందుతున్నారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. అసలు బంగారం ధరలు పెరగడానికి కేవలం అంతర్జాతీయ ధరల ఒడుదుడుకులు మాత్రమే కాదు.. భారీగా డిమాండ్ పెరగడం కూడా ఒక కారణం. ఏ వస్తువుకైనా డిమాండ్ పెరిగితే ధరలు ఆటోమేటిక్ గా పెరుగుతాయి. అది వ్యాపారంలో నైజం. ఇక బంగారం విషయంలో మాత్రం పేద నుంచి ధనవంతుల వరకూ కొనుగోలు చేయాలని భావిస్తుండటం ధరల పెరుగుదలకు కారణమవుతుంది.
వెండి తగ్గి.. బంగారం పెరిగి...
బంగారం, వెండి ధరలు అదుపు చేయడం, ధరలను నియంత్రణలో ఉంచడం ఎవరి చేతుల్లో ఉండదు. ఎందుకంటే అనేక కారణాలు ధరల పెరుగుదలకు దోహదపడుతుంటాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఉదయం ఆరు గంటలవరకూ నమోదయిన ధరలు మాత్రమే. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 82,360 రూపాయలకు చేరుకుంది. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,850 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,10,900 రూపాయలకు చేరుకుంది.