హైదరాబాద్‌కు మరో "వందేభారత్"

హైదరాబాద్ - బెంగళూరుల మధ్య మరో వందేభారత్ రైలు ప్రారంభం కానుంది. ఈ నెల 24వ తేదీన ఈ రైలును ప్రారంభించనున్నారు

Update: 2023-09-21 04:28 GMT

హైదరాబాద్ - బెంగళూరుల మధ్య మరో వందేభారత్ రైలు ప్రారంభం కానుంది. ఈ నెల 24వ తేదీన ఈ రైలును ప్రారంభించనున్నారు. కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్‌కు మధ్య ఈ రైలు తిరుగుతుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఈనెల 24వ తేదీన 12.30 గంటలకు ప్రారంభిస్తారు. కాచిగూడ రైల్వే స్టేషన్ లో జరిగే ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు.

ఈ నెల 24న...
ఉదయం 5.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటలకు వందేభారత్ రైలు యశ్వంత్ పూర్‌కు చేరుకుంటుంది. మధ్యలో మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్లలోనే ఆగుతుంది. మధ్యాహ్నం 2.45 గంటలకు యశ్వంత్‌పూర్ లోబయలుదేరి రాత్రి 11.15 గంటలకు కాచికూడ చేరుకుంటుంది. ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో మొత్తం తొమ్మిది వందేభారత్ రైళ్లను ఒకేసారి ప్రారంభించనున్నారు. ఐటీ ఉద్యోగులకు ఈ రైలు చాలా వరకూ ఉపయోగపడనుంది.


Tags:    

Similar News