నేడు శ్రావణ శుక్రవారం
నేడు మొదటి శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ఆలయాలు భక్తులతో నిండిపోయాయి
నేడు మొదటి శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా అమ్మవారి ఆలయాలన్నీ మహిళ భక్తులతో నిండిపోయాయి. ఈ శ్రావణ శుక్రవారం ఇంట్లో లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటే శుభప్రదమని మహిళలు భావిస్తారు. ఇంట్లోనే అమ్మవారిని పసుపుతో అలంకరించి వరలక్ష్మీ పూజలను నిర్వహిస్తారు.
ప్రత్యేక పూజలు...
కొత్త వస్త్రాలు ధరించి శ్రీమహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తే అష్టశ్వైర్యాలు, ఆయురోరగ్యం ఫలిస్తుందని నమ్ముతారు. అందుకే శ్రావణ మాసంలో మహిళలు ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు నిర్వహిస్తారు. పేద నుంచి ధనవంతుల వరకూ ఈ రోజు వరలక్ష్మీ వ్రతం చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భవాస్తారు. చుట్టుపక్కల వారిని పిలిచి తాంబూలాలు అందచేస్తారు. మహిళలకు ఇది ప్రత్యేక పండగ.