Balapur Laddu : రికార్డులను బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డూ ధర...ఎంతంటే?

బాలాపూర్ గణేశుడి లడ్డూ ఈసారి రికార్డు స్థాయి ధర పలికింది. గతంలో ఎన్నడూ లేని విధంగా లడ్డూ వేలం పాట పలికింది

Update: 2024-09-17 05:15 GMT

బాలాపూర్ గణేశుడి లడ్డూ ఈసారి రికార్డు స్థాయి ధర పలికింది. గతంలో ఎన్నడూ లేని విధంగా లడ్డూ వేలం పాట 30 లక్షల వెయ్యి రూపాయలకు చేరుకుంది. కొలను శంకర్ రెడ్డి ఈ లడ్డూను దక్కించుకున్నారు. బాలాపూర్ లడ్డూకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని సొంతం చేసుకుంటే సుఖసంతోషాలు, పాడి పంటలు, అష్టైశ్వర్యాలతో తులతూగుతామని నమ్ముతారు. అందుకే ఎక్కువ మంది ఈ లడ్డూ వేలంలో పాల్గొని దానిని తన సొంతం చేసుకునేందుకు చివరి వరకూ ప్రయత్నిస్తుంటారు.

గత ఏడాది ధర...
గత ఏడాది బాలాపూర్ లడ్డూ వేలం ధర 27 వేల రూపాయలు పలికింది. మొదట బాలాపూర్ గణనాధుడికి చివరిపూజ కార్యక్రమం నిర్వహించిన తర్వాత గణేశుడి ఉద్వాసన పూజ జరుగుతుంది. ఊరేగింపు అనంతరం గ్రామ బొడ్రాయి వద్ద లడ్డూ వేలంపాట జరుగుతుంది. అనాదిగా వస్తున్న సంప్రదాయం. 1994లో లడ్డూ ధరను కొలను మోహన్ రెడ్డి 450 రూపాయలతో తన సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి ధర పెరుగుతూనే ఉంది. అంటే ముప్పయి ఏళ్ల నుంచి లడ్డూ వేలంపాట జరుగుతుంది.
కొత్త నిబంధనలతో...
అయితే ఈ ఏడాది బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలానికి కొత్త నిబంధనలు పెట్టారు. గతేడాది వేలం పలికినంత డబ్బును ముందే డిపాజిట్ చేయాలని నిబంధన ఉచారు. వేలంలో కూడా ప్రత్యేకత ఉంటుంది. ఈ లడ్డూను చుట్టుపక్కల వారికి, బంధువులు, స్నేహితులులకు పంచుతారు. కొందరు పంట పొలాల్లో చల్లుతారు. ఈసారి వేలంలో పాల్గొనే భక్తులు 27 లక్షల మంది డిపాజిట్ చేశారు. మొత్తం ఇరవై మందికిపైగానే ఈ లడ్డూవేలంలో పాల్గొన్నారు. వీరిలో చివరకు కొలను శంకర్ రెడ్డి 30 లక్షల వెయ్యి రూపాయలకు. బాలాపూర్ లడ్డూనే సొంతం చేసుకున్నారు.


Tags:    

Similar News