హైదరాబాద్ లో ఒక్కసారిగా పేలిన రియాక్టర్లు
హైదరాబాద్ శివారులోని బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది
హైదరాబాద్ శివారులోని బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అమర్ ల్యాబ్స్‌లో గత రాత్రి రెండు రియాక్టర్లు ఒకేసారి పెద్ద శబ్దంతో పేలిపోయాయి. ప్రమాద సమయంలో 15 మంది కార్మికులు నైట్‌షిఫ్ట్‌లో పనిచేస్తుండగా వారిలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు శబ్దానికి భయపడిన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం కారణంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో పరిశ్రమలో అంధకారం నెలకొంది. సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.
భారీ శబ్దంతో రియాక్టర్ పేలిపోవడంతో జనం మొత్తం తెగ టెన్షన్ పడ్డారు. పరిశ్రమలో చీకటిగా వుండడంతో ఎంత మంది ప్రమాదంలో చిక్కుకున్నారనే విషయంలో స్థానిక పోలీసులు వివరాలు సేకరించారు. బాంబు పేలిందేమో అనే భయంతో ప్రజలు టెన్షన్ పడ్డారు. రెండు రియాక్టర్లు ఒక్కసారిగా పేలడంతో భారీ శబ్దం వచ్చింది. ప్రస్తుతం 9 మందిని చికిత్స నిమిత్తం మమతా హాస్పిటల్ తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.