లోన్ యాప్స్.. ఎక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చి ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే..! లోన్ యాప్స్ పెడుతున్న టార్చర్ కు చాలా మంది ప్రాణాలను కూడా విడిచిపెడుతూ ఉన్నారు. ఈ లోన్ యాప్స్ వెనుక చైనా కంపెనీలు ఉన్నాయి. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ల నుండి నేపాల్‌కు వచ్చిన కాల్‌లను హైదరాబాద్ సిటీ పోలీసులు ట్రేస్ చేశారు. చైనీస్ ఇన్‌స్టంట్ లోన్ యాప్ కేసు విచారణ చేస్తున్నారు పోలీసులు. అమాయక బాధితులను మోసం చేస్తున్నాయి ఈ కంపెనీలు. ఈ కంపెనీకి చెందిన భారతదేశంలోని ఉద్యోగులను అరెస్టు చేయడంతో లోన్ యాప్స్ కంపెనీలు తమ స్థావరాన్ని నేపాల్, భూటాన్, ఫిలిప్పీన్స్‌కు మార్చాయి. సాధారణంగా ఎగ్జిక్యూటివ్‌లుగా పిలువబడే మనీ కలెక్షన్ ఏజెంట్ల డిజిటల్ షేమింగ్ కారణంగా ప్రజలు ఆత్మహత్య చేసుకున్న తర్వాత భారతదేశంలోని అనేక నగరాల్లో పోలీసులు చైనీస్ లోన్ యాప్ కంపెనీలపై కేసులు నమోదు చేశారు. "కేసుల విచారణలో నేపాల్, భూటాన్, ఫిలిప్పీన్స్‌లో సర్వర్లు, బ్యాకెండ్ కార్యకలాపాలు ఉన్నాయని మేము కనుగొన్నాము" అని హైదరాబాద్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
2021లో తెలంగాణ పోలీసులు చైనీస్ లోన్ యాప్‌లకు సంబంధించి దాదాపు 50 కేసులను బుక్ చేశారు. చైనా పౌరులు సహా దాదాపు 100 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ పోలీసులు ప్లే స్టోర్ నుండి ఇలాంటి లోన్ యాప్స్ ను తొలగించాలని టెక్ దిగ్గజం గూగుల్‌కు లేఖ రాశారు. అయితే తక్షణ యాప్స్ కాకుండా లింక్స్ ను మెసేజీలుగా పంపుతున్నారు. Whatsapp లాంటి మెసేజింగ్ యాప్స్ ను కూడా ఉపయోగిస్తూ వస్తున్నారు. లింక్‌ను క్లిక్ చేసే అప్లికేషన్‌కి మళ్లించబడతారు.యాప్ ను డౌన్‌లోడ్ చేయిస్తున్నారు. "ఏ వ్యక్తి అయినా రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే అభ్యర్థనను ప్రాసెస్ చేసిన తర్వాత డబ్బులు అతని ఖాతాలో జమ చేయబడుతుంది. ముఠాలు పాత కస్టమర్ల డేటాబేస్‌ను కలిగి ఉన్నాయి. థర్డ్ పార్టీల ద్వారా కొత్త డేటాను పొందుతాయి"అని హైదరాబాద్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. "రికవరీ ఎగ్జిక్యూటివ్‌లు/ ఏజెంట్లు నేరుగా కాల్‌లు చేయకుండా వాట్సాప్ కాల్‌లు చేస్తున్నారు. సాధారణ ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడింది. వారు సాధారణ ఫోన్‌లలో డేటాను ఉపయోగించడం లేదు. ఫోన్ కాల్‌లు చేయడానికి హాట్‌స్పాట్‌లు లేదా వైఫైని ఉపయోగిస్తున్నారు, "అని అధికారి తెలిపారు.
వేల కోట్ల రూపాయల మోసానికి సంబంధించి గతంలో హైదరాబాద్ పోలీసులు 22 కేసులు నమోదు చేసి.. చైనా జాతీయులతో సహా 22 మందిని అరెస్టు చేశారు.దాదాపు 3,000 బ్యాంకు ఖాతాలు స్తంభించాయి. సైబరాబాద్ పోలీసులు, రాచకొండ పోలీసులు ఈ మోసానికి పాల్పడిన కొంతమంది విదేశీయులను, స్థానికులను కూడా అరెస్టు చేశారు. గుర్గావ్, బెంగళూరు, ఢిల్లీ మరియు హైదరాబాద్‌లోని కాల్ సెంటర్లపై పోలీసులు దాడి చేసి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.