హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
హైదరాబద్ వాసులకు మెట్రో రైలు సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది.;

హైదరాబద్ వాసులకు మెట్రో రైలు సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో రైళ్ల వేళలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు ఎక్కువ మంది రాత్రిసమయాలను పెంచాలని కోరుతున్నారు. అదే సమయంలో ప్యాసింజర్ల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ను అనుసరించి వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రైళ్ల వేళలను పొడిగించనున్నట్లు తెలిపారు.
వేళలను పెంచుతూ...
హైదరాబాద్ మెట్రో రైలు సేవల సమయాన్ని పొడిగించినట్టు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు రాత్రి 11 గంటల వరకు మాత్రమే ఉన్న మెట్రో సేవలు ఇకపై రాత్రి 11.45 వరకు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కొత్త సమయాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయని, సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఈ విస్తరించిన సమయం వర్తించనుందని తెలిపారు. అదనంగా, ఆదివారాల్లో టెర్మినల్ స్టేషన్ల నుంచి మొదటి మెట్రో రైలు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.