శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బంగారాన్ని ఎలా తీసుకొచ్చాడంటే? వీడి తెలవి తెల్లారిపోనూ

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు

Update: 2024-06-25 08:07 GMT

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు చేసిన తనిఖీల్లో ఈరోజు ఉదయం అరవై లక్షల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. ఉదయంఅబుదాబి నుంచి హైదరాబాద్ వచ్చిన విమానంలో ఒక ప్రయాణికుడి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అరవై లక్షల విలువైన...
ప్రయాణికుడి వద్ద 806 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దీని విలువ 60 లక్షల రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుడు బంగారాన్ని పొడిగా తయారుచచేసి దానిని ప్రయివేటు పార్ట్‌లో పెట్టుకుని రావడంతో కస్టమ్స్ అధికారులు అవాక్కయ్యారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Tags:    

Similar News