మా పప్పీ తప్పిపోయింది.. తెచ్చిపెట్టాలంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

మా పప్పీ తెచ్చిపెట్టాలంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

Update: 2022-06-27 11:19 GMT

కుక్కలను కొందరు ఎంత అల్లారుముద్దుగా పెంచుతూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్న బిడ్డలతో సమానంగా, వారి కంటే ఎక్కువగా చూసుకునేవారు కూడా ఉన్నారు. అవి తప్పిపోయినా.. ఎవరైనా తీసుకుపోయినా.. పెంచిన వారి గుండె బద్దలైపోతూ ఉంటుంది. తమ కుక్క తిరిగి వచ్చేదాకా కూడా ఎంతో బాధ పడుతూ ఉంటారు. కనిపిస్తే చెప్పండి.. దొరికితే తీసుకుని రండి.. మీకు కావాల్సిన డబ్బు ఇస్తాం అనే ప్రకటనలు చూస్తూ ఉంటాం.

తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఓ కుక్క పిల్ల తప్పిపోయిందనే కంప్లయింట్ నమోదైంది. తాము అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్క పిల్ల పప్పీ కనిపించకుండా పోయిందని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో దాని యజమాని ఫిర్యాదు చేశారు. అమీర్ పేట నాగార్జున నగర్ కు చెందిన దంపతులు తమ రెండు నెలల పప్పీ ఇంటి బయటకు రాగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకొని వెళ్లారు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను సైతం పోలీసులకు అందజేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.


Tags:    

Similar News