అలా చేస్తే అరెస్ట్‌ చేస్తాం.. హీరో నవదీప్‌కు పోలీసుల వార్నింగ్

తెలంగాణలోని హైదరాబాద్‌లో డ్రగ్స్‌ వ్యవహారం మరింతగా కలకలం రేపుతోంది. గత కొద్ది రోజులుగా సెలైంట్‌గా ఉన్న ఈ వ్యవహరం ..

Update: 2023-09-20 08:23 GMT

తెలంగాణలోని హైదరాబాద్‌లో డ్రగ్స్‌ వ్యవహారం మరింతగా కలకలం రేపుతోంది. గత కొద్ది రోజులుగా సెలైంట్‌గా ఉన్న ఈ వ్యవహరం మళ్లీ తెరమీదకు రావడంతో నిందితుల్లో గుబులు రేపుతోంది. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరుపుతూ బాధ్యులను గుర్తిస్తున్నారు. ఇక డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు చుక్కెదురైంది. పోలీసులు తనని డ్రగ్స్ కేసులో అరెస్టు చేయకుండా ఉండేందుకు ముందస్తు బయలు కోసం హైకోర్టును ఆశ్రయించాడు నవదీప్. ఈ మేరకు ఈనెల 16వ తేదీన కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన హై కోర్టు నవదీప్‌కు వదీప్ కు స్వల్ప ఊరట ఇచ్చింది. ఈ నెల 19 తేదీ వరకు అరెస్ట్ చేయకుండా ఉండేలా హై కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

అయితే 19 వ తేదీన లిస్ట్ కావాల్సిన నవదీప్ పిటిషన్ బుధవారం లిస్ట్ అయ్యి బెంచ్ మీదకు వచ్చింది. ఈ క్రమంలో హై కోర్టులో విచారణ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు హై కోర్టు విన్నది. గతంలోనూ నవదీప్ పై కేసులు ఉన్నాయని, ఇప్పుడు మాదాపూర్ డ్రగ్స్ కేస్ లోను ఒక నిందితుడు నవదీప్ తో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్టు చెప్పాడనీ అందుకే నవదీప్ పేరును నిందితులు జాబితాలో చేర్చామని పోలీసులు న్యాయ స్థానానికి తెలిపారు. ..అయితే గతంలో ఉన్న కేసుల్లో నవదీప్ ఎక్కడా నిందితుడిగా లేడని, దర్యాప్తు సంస్థలు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరయ్యారనీ కోర్టుకు వివరించారు నవదీప్‌ అడ్వకేట్ సిద్దార్థ్.

ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు పోలీసులు తమ విచారణ కొనసాగించుకోవచ్చని, ఒక వేళ విచారణ కు పిలువని భావిస్తే నవదీప్ కు 41 ఏ కింద నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఒక వేళ నవదీప్ తమ విచారణకు సహకరించకుంటే అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నవదీప్ గత ట్రాక్ రికార్డ్ ను పోలీసులు కౌంటర్ రూపంలో కోర్ట్ ముందు ఉంచారు..అయితే నవదీప్ న్యాయవాదికి కౌంటర్ కాపీ ఇవ్వలేదని అడ్వకేట్ వెంకట్ సిద్దార్థ్ తెలిపాడు.
అయితే ఈ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ డ్రామా ఆడుతున్నాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. తనకు ఏమి తెలియనట్లు డ్రామా ఆడుతున్నాడని, మాదాపూర్ డ్రగ్స్ కేసులో తనకు ఏమి సంబంధం లేదంటూ మొదట బుకాయించే ప్రయత్నం చేశాడని పోలీసులు చెబుతున్నారు. నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు నార్కోటిక్ వద్ద పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయని పోలీసుల ద్వారా సమాచారం. అయితే హై కోర్ట్ ఆదేశాల మేరకు డ్రగ్స్ కేసులో విచారణకు నవదీప్ సహకరించకుంటే అరెస్ట్ చేస్తామని నార్కోటిక్ పోలీసులు నవదీప్ కు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News