Hyderabad : కొత్త ఏడాది హైదరాబాద్ లో ఇంతమంది దొరికిపోయారా?

న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లను నిర్వహించారు.;

Update: 2025-01-01 02:05 GMT

న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లను నిర్వహించారు. అయితే పోలీసులు ఇన్ని హెచ్చరికలు జారీ చేసినా దాదాపు పన్నెండు వందల మంది వరకూ ఈ టెస్ట్ లలో పట్టుబడ్డారు. 1184 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లలో దొరికిపోయారు. జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీలలోని అనేక పబ్ లలో పోలీసులు దాడులు చేశారు.

ఆంక్షలు విధించినా...
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు అనేక ఆంక్షలు పెట్టారు. కానీ యువత మాత్రం ఆగలేదు. ఫ్లై ఓవర్లు మూసివేశారు. రాత్రి పది గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఫ్లై ఓవర్లను మూసివేశారు. అడగుడుగునా పోలీసులు నిఘా పెట్టినా కొందరు మాత్రం పట్టుబడి కొత్త ఏడాదిన ఇబ్బందిపడ్డారు. ఎక్కడా మద్యం తాగి ప్రమాదాలు జరగకూడదని పోలీసులు తీసుకున్న చర్యలు కొంత వరకూ ఫలించాయనే చెప్పాలి.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now


Tags:    

Similar News