హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి అనేక చోట్ల రహదారుల్లో నీరు నిలిచింది.
హైదరాబాద్ లో భారీ వర్షం కరుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో పాటు వర్షం కురుస్తుండటంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి అనేక చోట్ల రహదారుల్లో నీరు నిలిచింది. దీంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. వాహనాలు మెల్లగా సాగుతుండటంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మలక్ పేట్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి రోడ్డు మీద నీరు నిలిచి పోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఆదివారం కావడంతో...
అయితే ఆదివారం కావడంతో ఎక్కువ మంది సాయంత్రం వేళ బయటకు వచ్చారు. వీరంతా ట్రాఫిక్ లో చిక్చుకుపోయారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుండంతో పలు చోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షంతో పాటు ఈదురు గాలులు కూడా వీస్తుండటంతో రోడ్డుపైన ఉన్న చిరు వ్యాపారులు ఇబ్బందులు పాలయ్యారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచి పోవడంతో ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.