Hyderabad Metro : మెట్రోకు పెరిగిన రద్దీ.. ఎండల దెబ్బకు కూల్ కూల్ గా

ఎండల తీవ్రతకు హైదరాబాద్ నగరంలో రోడ్ల మీదకు రావాలంటేనే భయపడిపోతున్నారు. దీంతో మెట్రో రైళ్లకు డిమాండ్ పెరిగింది;

Update: 2025-03-20 04:08 GMT
hyderabad, temparatures, metro trains, full
  • whatsapp icon

ఎండల తీవ్రతకు హైదరాబాద్ నగరంలో రోడ్ల మీదకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఉదయం పది గంటలకు తమ విధులకు వెళ్లాల్సిన ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు ఎండల తీవ్రతకు ఇబ్బంది పడిపోతున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ద్విచక్ర వాహనంపై బయలుదేరి వెళ్లాలంటే ఈ ట్రాఫిక్ కు తోడు పైన ఎండతో సాధ్యం కావడం లేదు. హెల్మెట్ ధరించాల్సి రావడంతో చెమటలు కారిపోతూ వాహనంపైనే స్నానం చేస్తున్నారట. దీంతో ఎక్కువ మంది ఉద్యోగులు మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి.

వర్షాకాలంలోనూ...
మామూలుగానే మెట్రో రైళ్లు రద్దీ గా ఉంటాయి. వర్షాకాలం, ఎండాకాలంలో మెట్రో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ద్విచక్రవాహనాల్లో విధులకు వెళితే వర్షాకాలంలో తడిసిముద్దవుతారు. అదే ఎండాకాలంలోనూ చెమటతో తడిసి ముద్దవుతున్నారు. ట్రాఫిక్ లో గంటల పాటు వాహనంపై వెయిట్ చేయాలన్నా సాధ్య పడటం లేదు. మధ్యలో ఆగే అవకాశం కూడా లేకపోవడంతో మంచినీరు తాగేందుకు కూడా అవకాశం దొరకడం లేదని వాపోతున్నారు. అందుకే మెట్రో రైళ్లకు గత కొద్ది రోజుల నుంచి గిరాకీ పెరిగిందని మెట్రో అధికారులు చెబుతున్నారు.
ఉదయం నుంచే...
ఉదయం ఏడుగంటల నుంచే మెట్రో రైళ్లన్నీ ప్రయాణికులతో రద్దీగా మారుతున్నాయి. కార్లలో వెళ్లే వారు సయితం మెట్రో రైలులో ప్రయాణం సుఖంగా ఉందని భభావించి ఇటువైపు మళ్లారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మార్చి నెలలో మెట్రో ఆదాయం పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. కిక్కిరిసి పోయి ఉండటంతో అదనపు బోగీలు కానీ, అదనపు రైళ్లను కానీ వేయాలన్న డిమాండ్ ఎక్కువగా ఉంది. అమీర్ పేట్, మాదాపూర్, రాయదుర్గం వరకూ అన్ని స్టేషన్లలో రద్దీ పెరగడంతో మెట్రో రైలు అధికారులు కొన్నిరైళ్లను పెంచాలన్న డిమాండ్ ఊపందుకుంటుంది. ఆక్యుపెన్సీ రేటు పెరగుతున్నందున రైళ్ల సంఖ్యను కూడా పెంచాలని కోరుతున్నారు.


Tags:    

Similar News