మెట్రో రైళ్లపై ఆ ప్రకటనలు తీసేయాల్సిందే
హైదరాబాద్ మెట్రో రైళ్లపై ఉన్న బెట్టింగ్ యాప్స్ ప్రకటనలను తక్షణమే తొలగించాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆదేశించారు;

metro trains in hyderabad
హైదరాబాద్ మెట్రో రైళ్లపై ఉన్న బెట్టింగ్ యాప్స్ ప్రకటనలను తక్షణమే తొలగించాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆదేశించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రకటనలపై ఆయన గురువారం స్పందించారు. కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు ఉన్నాయన్న అంశం తన దృష్టికి వచ్చిందన్నారు.
తక్షణమే తొలగించాలని...
ఆ ప్రకటనలను తక్షణమే తొలగించాలని ఎల్‌అండ్‌టీ, సంబంధిత అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీలను ఆదేశించామని పేర్కొన్నారు. ప్రకటనల కంపెనీలు ఈ యాడ్స్ ను మెట్రో రైళ్లలో ప్రదర్శిస్తున్నాయి. అయితే బెట్టింగ్ యాప్స్ వల్ల యువత తప్పుదోవ పడుతుండటంతో పాటు లక్షలాది రూపాయలు కోల్పోతుండటంతో ఈ ప్రకటనలను తొలగించాలని ఎండీ ఆదేశించారు.