హైదరాబాద్ కుర్రోడు జాక్ పాట్ కొట్టేశాడు.. మూడుకోట్ల వేతనంతో ఉద్యోగం
హైదరాబాద్ కు చెందిన ఒక యువకుడికి మూడు కోట్ల భారీ వేతనంతో అమెరికాలో ఉద్యోగం లభించింది;

హైదరాబాద్ కు చెందిన ఒక యువకుడికి మూడు కోట్ల భారీ వేతనంతో ఉద్యోగం లభించింది. అమెరికాలోని చిప్ తయారీ సంస్థ ఎన్విడియాలో మూడు కోట్ల రూపాయల వేతనంతో జాబ్ కొట్టేశాడు. హైదరాబాద్ లోని ఎల్ బినగర్ కు చెందిన సాయిదినేష్ ఎన్ఐటీ కురుక్షేత్రలో కంప్యూటర్ సైన్స్ చదివాడు. ఆ తర్వాత న్యూటానిక్స్ కంపెనీలో ఏడాదికి నలభై లక్షల వేతనంతో ఉద్యోగం సంపాదించాడు.
ఎంఎస్ పూర్తి చేసి...
అది చేస్తూనే లాస్ ఏంజెల్స్ లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కార్నిఫోలియాలో క్లైడ్, ఏఐ టెక్నాలజీలో ఎంఎస్ పూర్తి చేశాడు. తర్వాత ఎన్విడియా కంపెనీలో జాబ్ సంపాదించి చిన్న వయసులోనే కోట్ల రూపాయల వేతనాన్ని పొందే అవకాశాన్ని సాధించుకున్నాడు. సాయి దినేష్ తండ్రి కృష్ణమోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. తమ కుమారుడికి మంచి ఉద్యోగం, భారీ వేతనం రావడంతో కుటుంబ సభ్యలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.