తెలంగాణ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్.. మూడు రోజులు మకాం
తెలంగాణలో ఎలక్షన్ కౌంట్‌డౌన్ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది.
తెలంగాణలో ఎలక్షన్ కౌంట్‌డౌన్ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో.. నిర్వహణా ఏర్పాట్లు ఊపందుకున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం.. మూడు రోజుల పాటు తెలంగాణలో ఉండి.. కీలక సమీక్షలు నిర్వహిస్తోంది. తొలిరోజు పార్టీల ప్రతినిధులతో కేంద్ర ఎన్నికల సంఘం బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ఆయా పార్టీలు తమ అభ్యంతారాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాయి
ఇందులో భగంగా మంగళవారం రాజకీయ పార్టీలతో భేటీ అయింది ఎన్నికల బృందం. ఎన్నికల నిర్వహణ, ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాలు, మోడల్ కోడ్ సహా పలు అంశాలపై నేతలతో చర్చించారు. బుధవారం జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సీఈసీ బృందం సమావేశం అవుతుంది. రాష్ట్ర సరిహద్దు జిల్లాలపై ప్రత్యేక నిఘా, సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత, రాజకీయ పార్టీల నేతల కోడ్ ఉల్లంఘన వంటి అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రజెంటేషన్ ఇస్తారు.
ఇక గురువారం ప్రభుత్వపరంగా అందిస్తున్న సహకారంపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతోనూ సీఈసీ బృందం ప్రత్యేకంగా సమావేశమవుతుంది. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తారు. సీఈసీ బృందం పర్యటన పూర్తైన తర్వాత ఏ క్షణమైనా తెలంగాణలో ఎన్నికల నగారా మోగే అవకాశం ఉంది.