Telangana : ఆగస్టు నెలలో ఉక్కబోత... వాతావరణంలో ఈ మార్పులేంటి? పెరిగిన ఏసీల వినియోగం

ఆగస్టు నెల వచ్చినా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నా ఉక్కపోత మాత్రం వదలడం లేదు

Update: 2024-08-06 04:37 GMT

ఆగస్టు నెల వచ్చింది. అయితే వాతావరణంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నా ఉక్కపోత మాత్రం వదలడం లేదు. ఉదయం పూట నుంచే ఉక్కపోత మొదలవుతుంది. బయట ఉష్ణోగ్రతలు లేకపోయినా ఉక్కబోతతో ప్రజలు అల్లాడి పోతున్నారు. ప్రధానంగా ఇలాంటి వాతావరణం ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. ఆగస్టు నెలలో సాధారణంగా చలి వాతావరణం నెలకొని ఉంటుంది. వర్షాల కారణంగా కొంత వాతావరణం చల్లబడినట్లు కనిపిస్తుంది. వాతావరణం చల్లగా ఉందనుకుంటే మాత్రం చెమటలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. ఒకరకమైన విభిన్న వాతావరణం నెలకొంది.

విద్యుత్తు వినియోగం...
ఇక రాత్రి వేళ ఏసీల వాడకం పెరిగిపోయిందని విద్యుత్తు శాఖ అధికారులు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా ఏసీల వాడకం పెరిగినందున విద్యుత్తు వినియోగం పెరిగిందని చెబుతున్నారు. ఆగస్టు నెలలో విద్యుత్తు వాడకం తక్కువగా ఉంటుంది. అయితే ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా ఉందని చెబుతున్నారు. పగలు నుంచి రాత్రి వరకూ ఉక్కబోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు విషజ్వరాలు కూడా విజృంభిస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. డెంగీ వంటి వ్యాధులు కూడా విపరీతంగా నమోదవుతున్నాయి. ఈపరిస్థితుల్లో వాతావరణ మార్పులతో హైదరాబాద్ వాసులు ఇబ్బంది పడుతున్నారు.
విద్యుత్తు బిల్లులు...
ఉక్కబోత కారణంగా ఫ్యాన్లు, ఏసీల వినియోగం పెరిగిపోవడంతో విద్యుత్తు బిల్లులు కూడా తడిసి మోపెడవుతున్నాయి. సాధారణంగా ఆగస్టు నెలలో ఇంతటి విద్యుత్తు వినియోగం ఉండదు. బిల్లులు కూడా తగ్గుతాయి. కానీ ఈసారి మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటంతో ప్రజలు ఇదేమి వాతావరణం అంటూ ఆందోళన చెందుతున్నారు. ఇంకా వేసవి కాలం నడుస్తున్నట్లునే ఉందంటున్నారు. బయట కొంత చల్లగా ఉన్నప్పటికీ, ఇళ్లలో మాత్రం ఉక్కబోత ఇబ్బందులు పెడుతుంది. ఇలా ఎప్పుడూ లేని వాతావరణం నెలకొనిందని, దీనివల్ల సీజనల్ వ్యాధులు త్వరగా సంక్రమించే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.



Tags:    

Similar News