ఆరు గంటలుగా మంటల్లోనే భవనం
ఉదయం పదకొండు గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇప్పటి వరకూ మంటలు అదుపులోకి రాలేదు.
ఉదయం పదకొండు గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇప్పటి వరకూ మంటలు అదుపులోకి రాలేదు. సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ లో డెక్కన్ బిల్డంగ్ ఇంకా మంటల్లోనే ఉంది. స్పోర్స్ వేర్ ఉండటం, ప్లాస్టిక్ సామాగ్రి, దుస్తులు ఎక్కువగా ఉండటంతో మంటలు అదుపులోకి రావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు నిర్వరామంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. భవనం ఇరుకు సందులో ఉండటంతో ఫైర్ ఇంజిన్లు ఒకేసారి ఎక్కువ సంఖ్యలో వెళ్లేందుకు కూడా వీలులేదు. దీంతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.
రెండు శ్లాబ్ లు...
మంటల ధాటికి భవనం కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే రెండు శ్లాబ్ లు కూలిపోవడంతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను నివాసాల నుంచి ఖాళీ చేయించారు. చుట్టుపక్కల భవనాలకు మంటలు వ్యాప్తి చెందే అవకాశముండటంతో ఆ ప్రాంతమంతా విద్యుత్ సరఫరాను నిలిపేశారు. నివాస భవనాలను ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. దీంతో అనేక మంది విలువైన వస్తువులను తీసుకుని బయటకు వచ్చారు.
ఘటన స్థలికి హోంమంత్రి...
మరోవైపు హోంమంత్రి మహమూద్ అలి సంఘటన స్థలిని సందర్శించారు. అగ్నిమాపక సిబ్బంది నిరంతరం మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రమాదంలో ఎవరైనా చనిపోయి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. మరో గంటలో మంటలు అదుపులోకి వస్తాయని హోంమంత్రి తెలిపారు. నాలుగు అంతస్థుల భవనం లోపలికి వెళ్లేందుకు వీలు కాకపోవడంతో ఒక వైపు నుంచే మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏ క్షణమైనా భవనం కూలి పోయే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతుంది.