Hyderabad : మలక్ పేట్ మెట్రో స్టేషన్ కింద అగ్ని ప్రమాదం
హైదరాబాద్ లోని మలక్ పేట్ మెట్రో స్టేషన్ కింద అగ్నిప్రమాదం జరిగింది.
హైదరాబాద్ లోని మలక్ పేట్ మెట్రో స్టేషన్ కింద అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసి ఉన్న ఐదు ద్విచక్రవాహనాలు దగ్దమయ్యాయి. మంటలు చెలరేగడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. మంటలు వ్యాపించిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందించడంతో అక్కడికు వచ్చిన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు.
దట్టమైన పొగ వ్యాపించడంతో...
మంటలు అంటుకుని దట్టమైన పొగ వ్యాపించింది. మెట్రో ప్రయాణికులు కూడా ఆందోళన చెందారు. ఈ ఘటనతో మలక్ పేట్ - దిల్ సుఖ్ నగర్ ల మధ్య ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అయితే మంటలు ఎందుకు వచ్చాయన్న దానిపై ఆరా తీస్తున్నారు.