Currency : కారులో ఐదు కోట్ల నగదు... షాక్ అయిన పోలీసులు

హైదరాబాద్ లో ఐదు కోట్ల రూపాయల నగదు తనిఖీల్లో పోలీసులకు పట్టుబడింది.

Update: 2023-11-23 12:58 GMT

తెలంగాణలో ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడుతుంది. పోలీసుల తనిఖీల్లో కోట్లాది రూపాయలు తనిఖీల్లో బయటపడుతున్నాయి. ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతుండటంతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జల్లెడ వేసి మరీ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు జరుగుతున్నాయని తెలిసినా కొందరు నగదును యధేచ్ఛగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. ఇన్ని కోట్ల రూపాయల నగదుకు లెక్కలు చెప్పకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు.

తనిఖీలు చేస్తుండగా...
తాజాగా ఐదు కోట్ల రూపాయల నగదు తనిఖీల్లో పోలీసులకు పట్టుబడింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని బొటానికల్ గార్డెన్స్ నుంచి చిరాక్ పబ్లిక్ స్కూలు వైపు వెళుతున్న కారును ఆపి పోలీసులు తనిఖీ చేశారు. పోలీసులకు అందులో సొమ్ము చూసి మైండ్ బ్లాంక్ అయింది. కట్టలు కట్టలు కరెన్సీ నోట్లు కనపడ్డాయి. లెక్కేసి చూడగా ఐదు కోట్లు అని తేలింది. ఈ నగదు హైదరాబాద్ కు చెందిన ఒక వ్యాపారవేత్తగా గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు.


Tags:    

Similar News