అది చిరుత కాదు.. అడవి పిల్లి అట
మియాపూర్ లో సంచరిస్తున్నది చిరుత కాదని అటవీ శాఖ అధికారులు చెప్పారు;

మియాపూర్ లో సంచరిస్తున్నది చిరుత కాదని అటవీ శాఖ అధికారులు చెప్పారు. నిన్న మియాపూర్ ప్రాంతంలో ఒక జంతువు సంచరించడంతో దానిని పులిగా భావించి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అది చిరుత కాదని వార్తకు అటవీ శాఖ అధికారులు చెక్ పెట్టారు. అక్కడ 200 ఎకరాలున్న అటవీ ప్రాంతంలో చిరుత పులి వచ్చి ఉంటుందని అందరూ భావించారు.
కానీ వీడియోలో, దాని నడక ఆధారంగా అది చిరుత కాదని, అడవి పిల్లి అని అటవీ శాఖ అధికారులు తేల్చారు. ఈ ప్రాంతంలో సంచరించింది చిరుత కాదని, అడవి పిల్లి అని అటవీ శాఖ అధికారులు తమ విచారణలో తేలిందన్నారు. ప్రజలు భయపడాల్సిన పనిలేదన్నారు. ఎవరి పని వారు నిర్భయంగా చేసుకోవచ్చని సూచించారు.