Hyderabad : అవసరమైతేనే బయటకు రండి... నగరవాసులకు జీహెచ్‌ఎంసీ వార్నింగ్
హైదరాబాద్ లో అవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రజలను హెచ్చరించారు
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. అనేక చోట్ల రహదారులపై నీళ్లు నిలిచింది. నీళ్లు వెళ్లిపోవాలంటే మరికొద్ది సేపు పడుతుంది. దీంతో పాటు మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతుందని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రజలను హెచ్చరించారు. ఎవరు బడితే వాళ్లు మ్యాన్ హోల్స్ మూతలను తెరవవద్దని, రాత్రి వేళ సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా మ్యాన్ హోల్స్ ను తెరిచి ఉంచితే అందులో పడే అవకాశముందని అధికారులు కోరుతున్నారు.
రేవంత్ సమీక్ష...
మరోవైపు సచివాలయంలో ఉన్న రేవంత్ రెడ్డి భారీ వర్షంపై హైదరాబాద్ లో నెలకొన్న ట్రాఫిక్ సమస్య తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. చెట్లు పడిపోవడంతో వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోయిన చోట వెంటనే పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని కోరారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో పాటు అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.