Hyderabad : హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్.. ఓకే చెబితే ఇక తిరుగులేదంతే

హైదరాబాద్ వాసులకు త్వరలో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. మెట్రో రైలు విస్తరణకు త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది

Update: 2024-01-23 03:31 GMT

హైదరాబాద్ వాసులకు త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. మెట్రో రైలు విస్తరణకు త్వరలోనే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ట్రాఫిక్ బాధల నుంచి హైదరాబాదీలకు విముక్తి కల్పించడానికి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే మెట్రో విస్తరణ పనులపై దృష్టి పెట్టారు. అనేక మార్గాలను పరిశీలించారు. ప్రధానంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకూ మెట్రో విస్తరణకు చేపట్టాల్సిన పరిస్థితిపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.

నేరుగా ఎయిర్ పోర్టుకు...
అయితే దావోస్ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెట్రో అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఫేజ్ 2 మెట్రో విస్తరణ రూట్ మ్యాప్ ను రేవంత్ కు అందించినట్లు తెలిసింది. నూతనంగా నాలుగు క్యారిడార్లలో ఈ మెట్రో నిర్మాణం పనులు చేపట్టాలని ఈ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. నాగోలు నుంచి శంషాబాద్ వరకూ వెళ్లే మెట్రో రైలు అతి పెద్ద లైన్ గా మారనుందని మెట్రో అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై ప్రభుత్వం ఆమోదం పొందాల్సి ఉంది.
గత ప్రభుత్వం...
గత ప్రభుత్వం కూడా శంషాబాద్ కు మెట్రో విస్తరిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకూ మెట్రోను విస్తరిస్తామని చెప్పింది. అయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పాతబస్తీ మీదుగా మెట్రోను శంషాబాద్ కు తీసుకెళ్లేలా ప్లాన్ ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో కొత్తగా నాలుగు కారిడార్లకు సంబంధించి అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం మొత్తం 70 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించాల్సి ఉంటుంది.
నాలుగు కారిడార్లలో...
జూబ్లీ బస్టాండ్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా చంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు మెట్రో మార్గాన్ని పొడిగించవచ్చని సూచించారు. అలాగే ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్ నుమా వరకూ మరొకటి, ఫలక్ నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకూ ఇంకొకటి, నాగోలు నంుచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకూ వేరొకటి మార్గాలతో నివేదికను మెట్రో అధికారులు రేవంత్ రెడ్డికి ఇచ్చినట్లు తెలిసింది. ఈ నాలుగింటిలో అత్యధికంగా నాగోలు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకూ 29 కిలోమీటర్ల మేర విస్తరించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపితే భాగ్యనగర వాసులకు ట్రాఫిక్ సమస్యల నుంచి మరింతగా బయటపడే అవకాశముంది.


Tags:    

Similar News