హైదరాబాద్ కు అలర్ట్.. మరో మూడు రోజులు వర్షాలే
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తమయింది
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తమయింది. అత్యవసర సమావేశం నిర్వహించింది. అధికారులు అందరూ 24 గంటలూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాటును ముమ్మరం చేయాలని అధికారులు ఆదేశాలు అందాయి.
కంట్రోల్ రూముల ఏర్పాటు....
ఇందుకోసం జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది. అత్యవసరమైతే కాల్ చేసేందుకు ప్రత్యేకంగా నెంబర్లను కేటాయించింది. గత రెండు రోజులుగా వర్షాలు తగ్గడంతో నగర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో భారీ వర్షం మొదలయింది. మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. రహదారులపై ట్రాఫిక్ సమస్యలను తలెత్తకుండా నీటిని ఎప్పటికప్పుడు తొలగించేందుకు ప్రత్యేక టీం లను ఏర్పాటు చేశారు.