Hyderabad : హైదరాబాద్ లో భారీ వర్షం.. రోడ్లపైనే నిలిచిపోయిన వాహనాలు

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండటంతో రహదారులన్నీ జలమయమయ్యాయి

Update: 2024-07-05 12:31 GMT

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండటంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఒక్కసారిగా వర్షం కురియడంతో రోడ్డుపైన ఉన్న ప్రజలు వర్షంలో చిక్కుకుపోయారు. కార్యాలయాల నుంచి బయలుదేరే సమయంలో వర్షం కురవడంతో రహదారులపై నీళ్లు నిలవడంతో అనేకచోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. జూబ్లీహిల్స్, మాదాపూర్, లక్డీకాపూల్, అమీర్ పేట్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ స్థంభించింది. వేలాది వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి.

ట్రాఫిక్ కు ఇబ్బందులు...
వర్షం దెబ్బకు రోడ్లపైకి నీరు చేరడంతో పాటు కొన్ని వాహనాలు మొరాయిస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, మాదాపూర్, కూకట్ పల్లి, మణికొండ, ప్రగతినగర్, ఎల్.బి.నగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేటలలో భారీ వర్షం కురిసినట్లు తెలిసింది. ఈ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతుననారు. అరగంట నుంచి కురుస్తున్న కుండపోత వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా తోడవ్వడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.


Tags:    

Similar News