చందానగర్ జేపీ సినిమాస్‌లో చెలరేగిన మంటలు

చందానగర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక గంగారం ప్రాంతంలో

Update: 2023-08-12 05:03 GMT

చందానగర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక గంగారం ప్రాంతంలో ఉన్న‌ జేపీ సినిమాస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని అలుముకున్నాయి. ఫైర్ ఆఫీసర్ గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ.. టపాడియా మాల్ లో మంటలను పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొచ్చామ‌ని తెలిపారు. మాల్ లోని ఐదో ఫ్లోర్‌ జేపీ సినిమాస్ లో అగ్నిప్రమాదం జరిగిందని వెల్ల‌డించారు. 7 ఫైర్ ఇంజన్ లతో మంటలను ఆర్పీ వేసామని తెలిపారు. మంటల తీవ్రత కేవలం లాబిలో మాత్రమే ఉందని.. థియేటర్‌లోని స్క్రీన్ లకు ఎలాంటి మంటలు అంటుకోలేదని అన్నారు.

కారిడార్ లో ఉన్న ఫర్నిచర్, సోఫాలకు మంటలు అంటుకున్నాయని.. కారిడార్ లో ఉన్న ఎలక్ట్రిక్ స్టవ్ వల్ల మంటలు వ్యాపించినట్టు భావిస్తున్నామ‌న్నారు. కారిడార్ లో చిప్స్, పాప్కార్న్, కూల్‌డ్రింక్స్ కు సంబంధించిన చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయి. వాటిలోని ఒక షాపులో మంటలు చెలరేగాయని వివ‌రించారు. థియేటర్ సిబ్బంది వెంటనే మంటలు ఆర్పి ఉంటే తీవ్రత పెరిగేది కాదన్నారు. కారిడార్ లో ఫైర్ జరుగుతుండడంతో ఫైర్ సేఫ్టీ ఎక్వీప్‌మెంట్‌ను ఆపివేశారని తెలిపారు. థియేటర్ సిబ్బంది వెంటనే స్పందించి ఉంటే మంటలు పెద్దగా వచ్చేవి కావని.. సమయానికి ఫైర్ ఇంజన్ లకు వాటర్ సప్లై చేయలేదని.. కొంత ఆలస్యం అయ్యిందని పేర్కొన్నారు.


Tags:    

Similar News