ఫుల్లయిన హుస్సేన్ సాగర్.. డేంజరస్ లెవెల్

భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ లో నీరు ఫుల్లుగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది

Update: 2024-09-02 03:53 GMT

భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ లో నీరు ఫుల్లుగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా హుస్సేన్ సాగర్ లో నీరు చేరడంతో ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. బంజారాహిల్స్, పికెట్‌, కూకట్‌పల్లి నాలాలతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో సాగర్‌కు భారీగా వరద నీరు చేరుతుందని అధికారులు తెలిపారు.

మూసీ నదిలోకి...
హుస్సేన్ సాగర్ నీటిమట్టం ఫుల్‌ ట్యాంక్‌లెవల్‌ దాటడంతో తూముల ద్వారా నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. దీంతో మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. హుస్సేన్‌సాగర్‌ ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ 513.41 మీటర్లు కాగా, ప్రస్తుతం 513.43 మీటర్లుగా ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే నిండిపోయిన హుస్సేన సాగర్ ను చూసేందుకు పెద్దయెత్తున సందర్శకులు తరలి వస్తున్నారు.


Tags:    

Similar News