హైదరాబాద్ పోలీసుల సూపర్ యాక్షన్.. కోటి రూపాయలకు పైగా రికవరీ!!
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రెండు వేర్వేరు కేసుల్లో
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రెండు వేర్వేరు కేసుల్లో బాధితులకు మొత్తం రూ.1.09 కోట్లు తిరిగి తెప్పించగలిగారు. బాధితులు ఇద్దరూ ట్రేడింగ్‌లో పెట్టుబడుల సాకుతో సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయారు. గణనీయమైన లాభాలు వస్తాయని ఆశ చూపించి బాధితుల దగ్గర డబ్బులు తీసుకున్నారు. మొదటి కేసులో, హైదరాబాద్‌లోని బేగంపేటకు చెందిన 52 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగి మోసపోయారు. లాజార్డూస్విప్.టాప్‌లో ట్రేడింగ్ ద్వారా అధిక రాబడులు వస్తాయనే ఆశ చూపించారు. బాధితులు మోసపూరిత ఖాతాలకు రూ.1.22 కోట్లు బదిలీ చేశారు. విచారణ అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులు రూ.80 లక్షలు రికవరీ చేసి బాధితులకు తిరిగి ఇవ్వగలిగారు. రెండవ కేసులో, 62 ఏళ్ల హైదరాబాద్ నివాసి గోల్డ్‌మ్యాన్ శాక్స్ సెక్యూరిటీస్ అని చెప్పుకునే దానిలో పెట్టుబడి పెట్టమని చెప్పి రూ. 32 లక్షలు కాజేశారు. విచారణ అనంతరం పోలీసులు విజయవంతంగా రూ.29 లక్షలను రికవరీ చేసి బాధితుడికి తిరిగి ఇచ్చారు.