హైదరాబాద్ శివారులో వరద భీభత్సం.. ఈ ప్రాంతాల్లో మొదలైన కష్టాలు

హైదరాబాద్ శివారు ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. గత కొన్ని గంటలుగా ఎడతెరిపి

Update: 2023-09-05 02:25 GMT

హైదరాబాద్ శివారు ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. గత కొన్ని గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉంది. రాజేంద్రనగర్, అత్తాపూర్, కాటేదాన్, నార్సింగీ, మణికొండ, గండిపేట, బండ్లగూడ లో భారీగా వర్షం పడింది. జలమయమైన రోడ్లు.. పలు కాలనీలలోకి వర్షం నీరు వచ్చింది. పలు చోట్ల విద్యుత్ అంతరాయం నెలకొంది. ఉప్పర్ పల్లి 191 పిల్లర్ వద్ద భారీగా వరద నీరు చేరింది. ఎక్కడికక్కడ నిలిచిపోయిన‌ వాహనాలు. భారీ గా ట్రాఫిక్ జామ్. శివరాంపల్లి 296 వద్ద రహదారి చెరువును తలపిస్తూ ఉంది. రోడ్డు పై వరద ప్రవాహం నిలిచిపోయింది. రాజేంద్రనగర్, శివరాంపల్లి లో అధిక శాతం వర్షపాతం నమోదైంది.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లే వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. జగద్గిరిగుట్ట, మూసాపేట్, కూకట్ పల్లి, జేఎన్టీయు, హైదర్ నగర్ లో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మెట్టుగూడ, సీతాఫల్మండి, పార్సిగుట్ట, గాంధీ ఆసుపత్రి, చిలకలగూడా, వారాసిగూడా ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. మల్కాజిగిరి సర్కిల్లో భారీ వర్షం కారణంగా కరెంటు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కుత్బుల్లాపూర్,షాపూర్ నగర్, గాజుల రామారం, దుండిగల్ లో భారీ వర్షం కురిసింది. నార్సింగీ బాలాజీ నగర్ కాలనీలో వరద నీరు చేరుకుంది. బాలాజీ నగర్ కాలనీ ఇళ్లలోకి వరద నీరు చేరింది. కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో వాహనాలు నీట మునిగి పోయాయి. మునిసిపల్ అధికారులు స్పందించడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు.
సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాలు జలమయ్యాయి. రోడ్లపై నుంచి వర్షపు నీరు డ్రైనేజీతో పాటు ప్రవహిస్తుంది. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని వారాసిగూడా, మహమ్మద్ గూడ, చిలకలగూడలోని నాలాలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన రహదారి జలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల వాసులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.


Tags:    

Similar News