ట్యాంక్ బండ్ పై ఆంక్షలు
ట్యాంక్ బండ్ పై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఇక ఇక్కడ ఎక్కడంటే అక్కడ వాహనాన్ని పార్కింగ్ చేస్తే కుదరదు
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఇక ఇక్కడ ఎక్కడంటే అక్కడ వాహనాన్ని పార్కింగ్ చేస్తే కుదరదు. వెంటనే పోలీసులకు సమచారం అందేలా వ్యవస్థను రూపొందించారు. వాహనాలను నిలిపిన వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు. ట్యాంక్ బండ్ పై రద్దీ ఎక్కువగా ఉండటం, ట్రాఫిక్ సమస్యలు తరచూ తలెత్తుతుండటంతో పోలీసులు ఈ నిర్ణయం తీుకున్నారు.
నో పార్కింగ్ జోన్ లోనే...
ట్యాంక్ బండ్ పే పార్కింగ్ జోన్ లోనే వాహనాలను నిలపాల్సి ఉంటుంది. ఎక్కడంటే అక్కడ నిలిపి హుస్సేన్ సాగర్ ను వీక్షిస్తామంటే ఇక కుదరదు. అలా పార్కింగ్ చేస్తే వాహన యజమానుల మొబైల్ కు క్షణాల్లో జరిమానా సందేశం వస్తుంది. ఇక స్పీడ్ గా కూడా అక్కడ వెళ్లేందుకు కుదరదు. నిర్దేశించిన వేగంతోనే ట్యాంక్ బండ్ పై వాహనాలు ప్రయాణించాల్సి ఉంటుంది.