డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో పనిమనిషి.. ప్రభుత్వోద్యోగం

పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో పని చేసే దివ్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది.;

Update: 2024-11-24 04:15 GMT

పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో పని చేసే దివ్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. సుకుమార్ ఇంట్లో దివ్య పనిచేసుకుంటూనే విద్యను కొనసాగించింది. దివ్య చదువు కోసం సుకుమార్ భార్య బబిత ప్రోత్సాహం ఎంతో ఉంది. ఆమె ఉన్నత చదువులు చదివి చివరకు ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించడంతో సుకుమార్ తో పాటు ఆయన భార్య బబిత అభినందించారు.

పని చేసుకుంటూనే...
సినిమా డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో దివ్య హెల్పర్ గా పనిచేస్తూనే తన భవిష్యత్ కు బంగారు బాటలు వేసుకుంది. చదువుపై శ్రద్ధ పెంచుకున్న దివ్యకు సుకుమార్ భార్య సహకరించింది. చివరకు దివ్యకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో సుకుమార్ తో పాటు, ఆమె భార్య బబిత దివ్యను చూసి గర్వంగా ఉందని, తమకు తృప్తిగా ఉందని చెబుతూ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.


Tags:    

Similar News