డేంజర్‌ జోన్‌లో మూసినది.. పెరుగుతున్న వరద ఉధృతి

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్న కురిసిన వర్షానికి తెలంగాణతోపాటు ఏపీ, హైదరాబాద్‌లోనూ తీవ్ర ఇబ్బందులకు..;

Update: 2023-09-06 01:53 GMT
Musi river

Musi river, Hyderabad, Rain. floods in musi

  • whatsapp icon

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్న కురిసిన వర్షానికి తెలంగాణతోపాటు ఏపీ, హైదరాబాద్‌లోనూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ప్రజలు. హైదరాబాద్ నగరం అంతటా వర్షాలు భారీగా కురియడంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రంగంలోకి దిగిని జీహెచ్‌ఎంసీ సహాయక సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరం మొత్తం అతలకుతలం అయిపోయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. నాలాలు సైతం ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు మూసీకి వరద పోటెత్తడంతో నీరు రోడ్లపైకి వస్తోంది. ఛాదర్ ఘాట్, మూసీ లో లెవల్ బ్రిడ్జ్‌లను ఆనుకుని వరద నీరు ప్రవహిస్తోంది. వరద ఉధృతి పెరుగుతుండటంతో అధికారులు అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు.

అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతో మూసి నదికి వరద పోటెత్తుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జూలూరు గ్రామం వద్ద లోలెవల్ వంతెనపై నుంచి మూసినది ఉదృతంగా ప్రవహిస్తోంది. అయితే వంతెన ఇరువైపులా పోలీసులు భారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. బీబీనగర్-భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామాల మధ్య రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఇక.. భారీ వర్షాలతో హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. భారీ వరద ఉధృతితో మూసీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతోంది. మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద వంతెనను ఆనుకొని నీరు ప్రవహిస్తోంది.

Tags:    

Similar News