Hyderabad : హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు ఎక్కారో? ఇక అంతే?
హైదరాబాద్ వాసులకు షాక్ తగిలింది. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ఛార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు;

హైదరాబాద్ వాసులకు షాక్ తగిలింది. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ఛార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి కిలోమీటరకు పది పైసలు చొప్పున పెంచారు. రేపటి నుంచి పెరిగిన ఛార్జీలు అమలులోకి రానున్నాయి. కారు, జీపు, లైట్ వాహనాలకు కిలోమీటరుకు పది పైసలు పెంచుతున్నట్లు ఐఆర్బీ ఇన్ ఫ్రా సంస్థ తెలిపింది. ప్రస్తుతం కిలోమీటరుకు ఈ ఛార్జీ 2.34 రూపాయలుగా ఉండగా అది 2.44 రూపాయలకు పెరిగింది.
కిలోమీటర్ పై...
ఇక మినీ బస్, ఇతరవాణిజ్య వాహనాలకు 3.77 నంచి 3.94 రూపాయలకు పెంచారు. టూ యాక్సిల్ బస్సులకు కిమీలకు 6.69 నుంచి ఏడు రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీఅయ్యాయి. భారీ వాహనాలకు కిలోమీటరకు 15.09 రూపాయల నుంచి15.78 రూపాయలకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. పెరిగిన ఛార్జీలు రేపటి నుంచి అమలులోకి రానున్నాయని తెలిపింది.