హెచ్.సి.యూ.లో కొనసాగుతున్న ఉద్రిక్తత
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి;

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నాలుగు వందల ఎకరాల భూమిని విక్రయించవద్దంటూ విద్యార్థులు నేడు ఆందోళనకు దిగననున్నారు. ఈరోజు తరగతులను బహిష్కరించాలని నిర్ణయించారు. మరొక వైపు నేడు బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు నేతలు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లాలని నిర్ణయించారు.
నేడు బీజేపీ ఎమ్మెల్యేలు...
దీంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా జేసీబీలతో చెట్లను తొలగిస్తుండటంతో వాటికి అభ్యంతరం చెబుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా నేడు బీజేపీ నేతలు కూడా సంఘీభావం ప్రకటించడానికి వెళ్లడంతో పరిస్థితి మరింత టెన్షన్ గా మారనుంది.